Begin typing your search above and press return to search.

ఇది పాన్ ఇండియా బిర్యానీ... రోజుకి రూ.60 లక్షల ఆదాయం!

ఈ క్రమంలో మొదట్లో గుడ్‌ గావ్‌ లో ఈ బీబీకే అవుట్‌ లెట్‌ ను ప్రారంభించిన విశాల్‌, కౌశిక్‌ లు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 45 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించారు.

By:  Tupaki Desk   |   11 March 2024 12:30 AM GMT
ఇది పాన్  ఇండియా బిర్యానీ... రోజుకి రూ.60 లక్షల ఆదాయం!
X

సాధారణంగా ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా అక్కడ బిర్యానీ మేన్డేటరీ అని చెప్పినా అతిశయోక్తి కాదు. బిర్యానీకీ జిహ్వకూ అంత అవినాబావ సంబంధం ఉంది మరి! అక్కడెక్కడో స్మెల్ వస్తేనే ఇక్కడ సగం కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావడం చాలా మందికి స్వీయానుభవమే! ఈ క్రమంలో భారీ స్థాయిలో బిర్యానీ వ్యాపారం చేస్తూ రోజుకు సుమారు రూ.60 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న ఒక కంపెనీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!

ఐఐటీ (బీ.హెచ్.యూ) ఓల్డ్ స్టూడెంట్ అయిన ఆగ్రాకు చెందిన విశాల్ జిందాల్.. అమెరికాలో ఎంబీఏ చేసి, అక్కడే ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో 1996లో ఇండియాకు తిరిగి వచ్చి తన అన్నతో కలిసి ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు. పదేళ్ల తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ గా మారినా కూడా అతనికి ఆ పనిలో సంతృప్తి లభించడం లేదు. ఈ సమయలో 2012లో ఒకరోజు ఆగ్రాకు వెళ్లినప్పుడు అక్కడ హోటళ్లలోనూ, బయటా బిర్యానీ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల్ని చూశాడు.

దీంతో... ఒక బ్రాండెడ్ బిర్యానీ చైన్ ను పెట్టాలని అనుకున్నాడు. అయితే.. బిర్యానీ వ్యాపారాన్ని చిన్నతనంగా భావించిన కుటుంబ సభ్యులు, పలువురు స్నేహితులూ అందుకు అంగీకరించలేదు. అయినా కూడా మార్కెట్ ను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమలోనే కౌశిక్ రాయ్ తో పరిచయం ఏర్పడింది. నిరుపేద ఫ్యామిలీ నుంచి వచ్చిన కౌశిక్.. భోపాల్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదివి వెయిటర్ గా కెరీర్ ప్రారంభించాడు. కష్టపడి పైకొచ్చి ఒక సంస్థకు సీఈఓ కూడా అయ్యాడు.

ఈ క్రమంలో మొదట్లో గుడ్‌ గావ్‌ లో ఈ బీబీకే అవుట్‌ లెట్‌ ను ప్రారంభించిన విశాల్‌, కౌశిక్‌ లు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 45 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. సుమారు వందకు పైగా క్లౌడ్ కిచెన్ లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోజుకు సుమారు రూ. 60 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది.

ఇక ఈ బీవీకే ప్రత్యేకతల విషయానికొస్తే... వీరి వద్ద బిర్యానీ ఎప్పుడంటే అప్పుడు క్షణాల్లో దొరకదు. అంటే... ముందుగానే చేసి ఉంచిన బిర్యానీని ఆర్డర్ రాగానే హీట్ చేసి పార్సిల్ చేసే పద్దతి ఇక్కడ ఉండనే ఉండదు. కిలో, అరకిలో.. ఎంతైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాతే తాజగా అందిస్తారు. ఆర్డర్ ఇచ్చిన అనంతరం మట్టికుండలో అప్పటికప్పుడు వండి వేడి వేడిగా అందిస్తారు. ఈ ఆలోచన వారికి బాగా కలిసి వచ్చిందని అంటారు!