Begin typing your search above and press return to search.

నీ పప్పు "బంగారం" కానూ... ఇదేమి వంటకం స్వామీ..?

వివరాళ్లోకి వెళ్తే... దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్ లో పనిచేసే చెఫ్ రణ్ వీర్ బ్రార్... తాజాగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో దాల్ ఫ్రై చేశాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 11:30 PM GMT
నీ పప్పు బంగారం కానూ...  ఇదేమి వంటకం స్వామీ..?
X

సాధారణంగా పప్పు ఎలా వండుతారు..? వండటం వచ్చినవారికి, వండింది తినడం చేసేవారికీ ఆల్ మోస్ట్ అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది కావొచ్చు! టమాటా పప్పు, ఆనపకాయపప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, పప్పు చారు, ముద్దపప్పు... ఈ లిస్ట్ సంగతి కాసేపు ఆపి అసలు విషయంలోకి వెళ్తే... ఇప్పుడు మనం చెప్పుకోబోయే పప్పు.. బంగారంతో చేసిన పప్పు!

అవును... మీరు చదివింది అక్షరాలా నిజం! పప్పును రకరాకాలుగా వండుతున్న విధానం నచ్చకో.. లేక, వెరైటీగా ట్రై చేయాలనో తెలియదు కాన్నీ... పప్పు వండిన తర్వాత పైన నూనె, నెయ్యి ప్లేస్ లో బంగారాన్ని కరిగించి వేశారు ఒక చెఫ్. దీంతో ఈ బంగారం పప్పు ఇప్పుడు హాట్ టాపిక్ కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్ లో పనిచేసే చెఫ్ రణ్ వీర్ బ్రార్... తాజాగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో దాల్ ఫ్రై చేశాడు. దానికి "దాల్ కష్కన్" అని నామకరణం కూడా చేశాడు. ఈ సమయంలో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో కింద క్రియేటివిటీకి పనిచేబుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి "దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్ చెఫ్ రణ్ వీర్ బ్రార్ దీన్ని తయారు చేశారు.. 24 క్యారెట్ గోల్డెన్ తడ్కే వాలీ దాల్" అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ దాల్ కష్కన్ ధర 58 దిర్హామ్‌ లు మాత్రమేనట! అంటే భారత కరెన్సీలో సుమారు 1,300 రూపాయలు అన్నమాట. ఈ దాల్ కష్కన్ తయారీలో నూనె స్థానంలో కరిగించిన బంగారాన్ని ఉపయోగించారు.

ఇక దీనికి సంబంధించిన వీడియోకి క్రియేటివ్ గా విత్ ఆకలితో వచ్చిన కడుపుమంటతో అన్నట్లుగా స్పందిస్తున్న నెటిజన్లు... ఈ దాల్ కర్రీ తినడానికా దాచుకోవడానికి అని అడుగున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈసారి రేడియం కా తడ్కా ప్రయత్నించండి అని మరొకరు స్పందించారు. ఇదే సమయంలో ఎవరి వెర్రి వారికి ఆనందం అని ఇంకొకరు స్పందించడం గమనార్హం.