ఈ సంపత్ లో అదరగొట్టే షేర్లు ఇవేనట.. ఎవరు చెప్పారంటే?
గతంలో పరిమిత సమూహానికి మాత్రమే చూసే షేర్ మార్కెట్ లోకి ఇప్పుడు నూనూగు మీసాలు వస్తున్న వేళలోనే పెట్టుబడులు పెట్టేస్తున్న రోజులివి.
By: Tupaki Desk | 12 Nov 2023 5:05 AM GMTగతంలో పరిమిత సమూహానికి మాత్రమే చూసే షేర్ మార్కెట్ లోకి ఇప్పుడు నూనూగు మీసాలు వస్తున్న వేళలోనే పెట్టుబడులు పెట్టేస్తున్న రోజులివి. క్యాలెండర్ ఇయర్ జనవరి - డిసెంబరు అయితే.. విద్యా క్యాలెండర్ ఇయర్ జూన్ - ఏప్రిల్ గా చెబుతారు. అదే.. వ్యాపార క్యాలెండర్ చూస్తే ఏప్రిల్ - మార్చి. మరి.. షేర్ మార్కెట్ ట్రేడింగ్ కు సంప్రదాయ బద్ధంగా దీపావళి - దీపావళిగా లెక్కలేస్తారు. ఈ కాలాన్ని సంపత్ కాలంగా పేర్కొంటారు. 2079 సంపత్ ట్రేడింగ్ శుక్రవారంతో పూర్తి కాగా.. సరికొత్త సంపత్ ట్రేడింగ్ (2080) ఈ రోజు (ఆదివారం) నుంచి మొదలు కానుంది.
దీపావళి రోజున గంట పాటు ప్రత్యేకంగా ట్రేడ్ జరగటంతో మొదలయ్యే సరికొత్త సంపత్ ఏడాది.. రానున్న రోజుల్లో కొన్ని షేర్లు పెట్టుబడులకు అనుకూలమైనవిగా పేర్కొంటూ కొన్ని సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. సిరులు ఒలికించే స్టాక్ మార్కెట్ లో మదుపరులు ఏ షేర్ల మీద పెట్టుబడులు పెట్టొచ్చన్న అంచనాను కొన్ని బ్రోకరేజ్ సంస్థలు వెల్లడించాయి. ఈ రోజుతో మొదలయ్యే కొత్త సంపత్ లో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయని చెప్పాలి. ఈ నెలలో ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండగా.. వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. జాగ్రత్తలు తీసుకుంటూ ట్రేడింగ్ చేసే వారికి బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు పేర్కొనే అంచనాలన్ని కూడా ఆయా బ్రోకరేజ్ సంస్థలు వెల్లడించిన వివరాలే అన్నది మర్చిపోకూడదు. వీటిల్లో పెట్టుబడులుపెట్టొచ్చా? లేదా? అన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన వ్యక్తిగత అభిప్రాయం. ఆయా సంస్థలు రికమెండ్ చేసిన స్టాక్ లో డబ్బులు పెట్టే ముందు మరింత అధ్యయనం చేయటం అవసరమన్నది మర్చిపోకూడదు. ఇంతకూ ఆయా సంస్థలు ఏయే షేర్లను రికమెండ్ చేశాయన్న విషయంతో పాటు రానున్న ఏడాదిలో ఎంత మేరకు వెళతాయన్న అంచనాను ఇవ్వటం గమనార్హం.
హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ అంచనాల్ని చూస్తే..
షేర్ అంచనా ధర (రూ)
డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ 6250
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 112
గెయిల్ (ఇండియా) 140
గోద్రెజ్ ఇండస్ట్రీస్ 735
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2275
గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ 875
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 103
కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ 795
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2695
యునైటెడ్ స్పిరిట్స్ 1195
మోతీలాల్ ఓస్వాల్
షేర్ అంచనా ధర(రూ)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 700
టైటన్ 3900
ఎంఅండ్ ఎం 1770
సిప్లా 1450
ఇండియన్ హోటల్స్ 480
దాల్మియా భారత్ 2800
కేన్స్ టెక్ 3100
రేమండ్ 2600
స్పందన స్ఫూర్తి 1100
రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా 135
ఐసీఐసీఐ డైరెక్ట్
కంపెనీ అంచనా ధర (రూ)
ఎల్ అండ్ టీ 3560
కోరమాండల్ ఇంటర్నేషనల్ 1330
ఎస్ బీఐ 725
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 1100
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1260
యాక్సిస్ సెక్యూరిటీస్
సంస్థ అంచనా ధర (రూ)
టీవీఎస్ మోటార్స్ 2100
భారతీ ఎయిర్ టెల్ 1155
ఏపీ ఎల్ అపోలో ట్యూబ్స్ 1950
జ్యోతి ల్యాబ్స్ 440
కేపీఐటీ టెక్నాలజీ 1500
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1800
ఆస్ట్రాల్ 2150
అహ్లువాలియా కాంట్రాక్ట్స్ 770
ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1535
నిర్మల్ బాంగ్
సంస్థ అంచనా ధర (రూ)
ఆర్చియాన్ కెమికల్ ఇండస్ట్రీ 767
ఎలికాన్ ఇంజినీరింగ్ 1050
ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ 1100
ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ 820
సాయి సిల్స్ (కళామందిర్) 323
సంఘ్వీ మూవర్స్ 864
ఎస్ఆర్ఎఫ్ 2637
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ 1830
విష్ణు కెమికల్స్ 421
విష్ణు ప్రకాశ్ ఆర్ పుంగాలియా 262
ఆనంద్ రాఠి
సంస్థ అంచనా ధర (రూ)
సిర్మా ఎస్ జీఎస్ టెక్నాలజీ 735
ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ 114
డీఎల్ఎఫ్ 640
ఎంటార్ టెక్నాలజీస్ 2970
టీవీఎస్ మోటార్ కంపెనీ 1850
మహీంద్రా అండ్ మహీంద్రా 1770