Begin typing your search above and press return to search.

పార్టీలో గాళ్ ఫ్రెండ్‌కి చాహ‌ల్ టైట్ హ‌గ్

అలాగే బ‌ర్త్ డే పార్టీ అయ్యాక‌, మ‌హ్వాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ ఒక రెస్టారెంట్‌లో కూర్చున్న ఫోటోని కూడా షేర్ చేసి ఆ ఫోటోకి విచిత్రమైన పుట్టినరోజు శుభాకాంక్షల నోట్ రాశారు.

By:  Tupaki Desk   |   25 July 2025 8:25 AM IST
పార్టీలో గాళ్ ఫ్రెండ్‌కి చాహ‌ల్ టైట్ హ‌గ్
X

క్రికెట‌ర్ చాహ‌ల్ భార్య ధ‌న‌శ్రీ నుంచి విడిపోక ముందు నుంచి ఆర్.జే మ‌హ‌వాష్‌కి స్నేహితుడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి క్రికెట్ ఈవెంట్ల‌లో సంద‌డి చేసారు. ఇటీవ‌ల ప్రొటీన్ వోట్స్, డార్క్ చాక్లెట్ వంటి ప్ర‌క‌ట‌న‌ల్లోను క‌లిసి న‌టించారు. అయితే మ‌హ‌వాష్ తో అత‌డి సాన్నిహిత్యం విడాకుల త‌ర్వాత మ‌రింత ఎక్కువ‌గా మీడియా ఎదుట హైలైట్ అయింది. కార‌ణం ఏదైనా ఆర్జే మహవాష్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. వారిద్దరూ ఆ పుకార్లను ఖండించినా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.

ఆ ఇద్ద‌రూ చాలాసార్లు క‌లిసి ప‌బ్లిగ్గా స‌న్నిహితంగా క‌నిపిస్తున్నారు. ఇప్పుడు లండన్‌లో తన పుట్టినరోజు వేడుకలో చాహల్ త‌న స్నేహితురాలైన‌ మహవాష్‌ను హార్ట్‌ఫుల్ గా కౌగిలించుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. జూలై 23న లండన్‌లో క్రికెటర్ చాహల్ తన 35వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్ తీసిన యూనిక్ ఫోటో వైర‌ల్ గా షేర్ అవుతోంది. బ‌ర్త్ డే వేడుక‌ల ఆద్యంతం చాహ‌ల్ చాలా ఉత్సాహంగా ఆనందంగా క‌నిపించాడు. పైగా త‌న‌తో పాటే ఉన్న గాళ్ ప్రెండ్ మ‌హ‌వాష్‌ని గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. వేడుక ఆద్యంతం మ‌హ్వాష్ అందంగా న‌వ్వుతూ ఆనందంగా క‌నిపించింది. తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా వేడుకలో కనిపించాడు. అక్క‌డ వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాద‌క‌రంగా క‌నిపించింది.

అలాగే బ‌ర్త్ డే పార్టీ అయ్యాక‌, మ‌హ్వాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ ఒక రెస్టారెంట్‌లో కూర్చున్న ఫోటోని కూడా షేర్ చేసి ఆ ఫోటోకి విచిత్రమైన పుట్టినరోజు శుభాకాంక్షల నోట్ రాశారు. ``హ్యాపీ బర్త్‌డే యుజీ! వయసు పెరగడం జీవితంలో ఒక భాగం.. ఇతర భాగాలు ఇంకా చెత్తగా ఉంటాయి.. కాబట్టి ఆల్ ది బెస్ట్`` అని రాసింది. చాహ‌ల్ కి మాత్ర‌మే కాదు.. మహ్‌వాష్ కి కూడా జీవితంలో క‌ఠిన‌మైన అనుభ‌వాలున్నాయి. ఒక‌సారి పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయింద‌ని గ‌త ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పాన‌ని వెల్ల‌డించింది. పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేద‌ని కూడా తెలిపింది. ప్ర‌స్తుతం ఆర్జే మ‌హ్వాష్‌ న‌ట‌న‌లోకి ప్ర‌వేశించింది. వెబ్ సిరీస్ `ప్యార్ పైసా ప్రాఫిట్‌`తో తన నటనను ప్రారంభించింది. ఈ షో MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.