Begin typing your search above and press return to search.

అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు

మహ్‌వశ్‌ ఆ వీడియోలో మాట్లాడుతూ... నా జీవితంలోకి వచ్చే అబ్బాయి ఒకే ఒక్కడు కానున్నాడు. జీవితం మొత్తానికి అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు కానున్నాడు.

By:  Tupaki Desk   |   3 April 2025 6:26 PM IST
అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు
X

టీం ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఇటీవలే తన భార్య ధన్య శ్రీ కి విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. వీరి విడాకుల వార్తలు అభిమానులను ఆవేదనకు గురి చేసింది. చాహల్‌ వైవాహిక జీవితం గురించి చాలా మంది ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌ పరంగా సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన సమయంలో చాహల్‌ వైవాహిక బంధంలో ఇబ్బందులు తలెత్తడం అనేది విచారకరం అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ వచ్చారు. చాహల్‌ విడాకుల వార్తలు వస్తున్న సమయంలోనే మరో వైపు ప్రేమ విషయమై ప్రచారం మొదలైంది. చాహల్‌ అప్పుడే ప్రేమలో పడ్డాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది.

చాహల్‌ మరోసారి ప్రేమలో పడ్డట్టు దాదాపుగా కన్ఫర్మ్‌ అయింది. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ సమయంలో చాహల్‌, రేడియో జాకీ మహ్‌వశ్‌ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయం అనుమానాలు ఉన్న సమయంలో తాజాగా మహ్‌వశ్‌ చేసిన పోస్ట్‌కి చాహల్‌ లైక్ చేయడంతో క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్స్‌ ముఖ్యంగా ఫ్యాన్స్ నిర్థారణకు వచ్చేశారు. అంతే కాకుండా మహ్‌వశ్‌ చేసిన పోస్ట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మహ్‌వశ్‌ ఆ వీడియోలో మాట్లాడుతూ... నా జీవితంలోకి వచ్చే అబ్బాయి ఒకే ఒక్కడు కానున్నాడు. జీవితం మొత్తానికి అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు కానున్నాడు. ఇక ముందు అతడి చుట్టూ నా జీవితం తిరుగుతుంది. అతడితోనే నా జీవితం మొత్తం సాగించాలని కోరుకుంటున్నాను. నాకు అవసరం లేని వ్యక్తులు, నాతో అవసరం ఉంది అనుకుంటున్న వ్యక్తులు వద్దు. నా అవసరం కోసం ప్రయత్నించే అబ్బాయిలతో నేను మాట్లాడాలి అనుకోవడం లేదని ఆసక్తికర వ్యాక్యలు చేసింది. మహ్‌వశ్‌ చేసిన ఈ సోషల్‌ మీడియా పోస్ట్‌కి ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె పోస్ట్‌కు జనాలు పెద్దగా రియాక్ట్‌ అయ్యేవారు కాదు. కానీ ఎప్పుడైతే చాహల్‌ లైక్‌ కొట్టాడో అప్పటి నుంచి చర్చ మొదలైంది. నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ లైక్‌తో గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారని కొందరు అంటే, మరికొందరు ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ కామెంట్‌ చేశారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో చాహల్‌, మహ్‌వశ్‌ గురించిన పోస్ట్‌లతో తెగ వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.