ప్రియాంక చోప్రా పోటీగా భావించేది
ప్రియాంక చోప్రా అందాల పోటీల్లో పాల్గొన్న టైమ్ లో తన సలహాలు, సూచనలు తీసుకుందని, అప్పుడే ఆమెతో పరిచయం ఏర్పడిందని యుక్తా ముఖి తెలిపారు.
By: Tupaki Desk | 27 Jun 2025 9:30 PMప్రియాంక చోప్రా లో తనకు నచ్చిన విషయమేమీ లేదన్నారు మాజీ ప్రపంచ సుందరి యుక్తా ముఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రియాంక చోప్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక చోప్రా అందాల పోటీల్లో పాల్గొన్న టైమ్ లో తన సలహాలు, సూచనలు తీసుకుందని, అప్పుడే ఆమెతో పరిచయం ఏర్పడిందని యుక్తా ముఖి తెలిపారు.
1999లో యుక్తా ముఖి ప్రపంచ సుందరిగా గెలవగా, ఆ తర్వాతి సంవత్సరంలో ప్రియాంక చోప్రా అందాల పోటీల్లో పాల్గొన్నారు. ప్రియాంక కూడా ప్రపంచ సుందరిగా గెలిచారు. మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అయ్యే క్రమంలో ప్రియాంక తనను సంప్రదించిందని, ప్రియాంక తన జూనియర్ అని, తన నుంచి పలు విషయాలను అడిగి తెలుసుకుందని, ప్రియాంక పేరెంట్స్ కూడా తన కుటుంబ సభ్యులతో మాట్లాడి కాంపిటీషన్ కు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారని యుక్తా తెలిపారు.
ప్రియాంక తనను ఓ పోటీలా చూసేదని, తన వల్ల ఆమె ఫేమ్ కు డేంజర్ అని భయపడిందని, ఆమెలో తనకు నచ్చిన విషయాలంటూ ఏమీ లేవని, ఇంకా చెప్పాలంటే అసలు ఈ టైమ్ లో ప్రియాంక గురించి తనను అడగటం కరెక్ట్ కాదని యుక్తా ముఖి అభిప్రాయపడ్డారు. తన సీనియర్ అయిన జూహీ చావ్లా తాను ప్రపంచ సుందరి కిరీటం గెలిచాక మాట్లాడారని, చాలా అందంగా, ఎత్తుగా ఉన్నానని తనను మెచ్చుకున్నారని చెప్పారు.
ఐశ్వర్యారాయ్, సుస్మితా తనతో చాలా బాగా మాట్లాడేవారని, వారెవరూ తనను పోటీగా చూడకుండా ఎంతో మర్యాదగా మాట్లాడేవారని ఆమె వెల్లడించారు. మిస్ వరల్డ్ గా గెలిచాక యుక్తా ముఖి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. నటిగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అందరికీ వచ్చినట్టు ఆమెకు తగిన ఫేమ్ మాత్రం రాలేదు.