Begin typing your search above and press return to search.

కొడుకు పెళ్లిలో వైఎస్ షర్మిల డ్యాన్సులు... వీడియో హల్ చల్!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:41 AM GMT
కొడుకు పెళ్లిలో వైఎస్ షర్మిల డ్యాన్సులు... వీడియో హల్ చల్!
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి - ప్రియ ల వివాహ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ సమయంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది.

అవును... వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి తాజాగా విడుదలైన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో దంపతులు, అతిథులతో పాటు ప్రధానంగా వైఎస్ షర్మిళ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ రంగంలో ఎప్పుడూ చిటపటలాడుతున్నట్లు కనిపించే ఏపీ పీసీసీ చీఫ్... కుమారుడి పెళ్లిలో ఫుల్ జోష్ లో, చిరు నవ్వులు చిందిస్తూ, డ్యాన్స్ చేశారు.

దీనికి సంబందించిన వీడియోను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిళ... "క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం" అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులతో పాటు తెలంగాణ కేబినెట్ సగానికి పైగా హాజరైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, కొప్పుల రాజు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీప దాస్ మున్షీ హాజరయ్యారు.

ఇదే సమయలో తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మల్లు రవి, మంత్రులు.. పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్, లతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, జేడీ శీలం, మస్తాన్ వలిలు హాజరయ్యారు. ఇక కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డి.కే. శివకుమార్ హాజరయ్యారు.

కాగా... రాజారెడ్డి - ప్రియల వివాహ వేడుకలు రాజస్థాన్ లోని ఉమైద్ ప్యాలెస్‌ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియా వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. 16న మొదలైన పెళ్లి వేడుకలను మూడు రోజులు పాటు పలు కార్యక్రమాలతో సందడిగా నిర్వహించారు. ఆదివారం తలంబ్రాలు మహోత్సవం ఘనంగా పూర్తయింది.