Begin typing your search above and press return to search.

స్పై యూనివర్స్‌లో చెత్త సినిమా.. గాలి తీసేసిన‌ YRF అసిస్టెంట్

హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి అసాధార‌ణ స్టార్లు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'వార్ 2' స‌మీక్ష‌కుల్ని ఎంత‌మాత్రం మెప్పించ‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   18 Aug 2025 3:04 PM IST
స్పై యూనివర్స్‌లో చెత్త సినిమా.. గాలి తీసేసిన‌ YRF అసిస్టెంట్
X

హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి అసాధార‌ణ స్టార్లు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'వార్ 2' స‌మీక్ష‌కుల్ని ఎంత‌మాత్రం మెప్పించ‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా వీక్ స్టోరి లైన్, వీఎఫ్ఎక్స్ ప‌నిత‌నంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స్టార్ ప‌వ‌ర్ తో ఓపెనింగ్ వ‌సూళ్లు బావున్నా ఈ సోమ‌వారం నుంచి అస‌లైన టెస్ట్ మొద‌లైంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో వైఆర్ఎఫ్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మించ‌గా, రిట‌ర్నుల ప‌రంగా సేఫ్ జోన్‌కి చేరుకుంటుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.


ఈ సినిమా మొద‌టి మూడు రోజుల్లో 200 కోట్లు వ‌సూలు చేసింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయినా సినిమా చూసిన చాలామంది ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు కూడా పెద‌వి విరిచేసారు. అగ్నికి ఆజ్యం తోడైన‌ట్టు, ఇప్పుడు వైఆర్ఎఫ్ సంస్థ‌లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్లకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన రాజ్ వీర్ అష‌ర్ 'వార్ 2'ని తీవ్రంగా విమ‌ర్శించాడు. పఠాన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్‌వీర్ అషర్ ఈ చిత్రం త‌న‌ను భారీగా నిరాశకు గురి చేసింద‌ని, స్పై యూనివ‌ర్శ్ లో ఇదే చెత్త సినిమా అని అన్నారు.

షారూఖ్ ఖాన్- సిద్ధార్థ్ ఆనంద్‌ల 'పఠాన్', హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ 'వార్', ఫైటర్ వంటి భారీ చిత్రాలకు సిద్ధార్థ్ ఆనంద్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజ్‌వీర్ వార్ 2 చూసిన తర్వాత కలతకు గుర‌య్యాన‌ని చెప్పాడు. ఇన్ స్టాలో అత‌డు విచారం వ్య‌క్తం చేసాడు. ``ఇది నాకు హృదయ విదారక అనుభవం. నేను ఈ సినిమా కోసం చాలా ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నాను. స‌రే ఇదంతా నన్ను ఏమాత్రం బాధపెట్టలేదు! మొదటి సగం తర్వాత ఒక విచారకరమైన అతిగా సాగే సెకండాఫ్‌. స‌రైన ఎత్తుగ‌డ‌లు లేవు. క‌థ‌లో ఆశించ‌న‌వేవి లేవు. ఎమోష‌న‌ల్ గా నాకు క‌నెక్ట్ కాలేదు. అస‌లు ఊహించ‌ని నిరాశ.. వైఆర్ఎఫ్ స్పై యూనివ‌ర్శ్‌లో బ‌ల‌హీన‌మైన సినిమా ఇది!`` అని విమ‌ర్శించారు.

ఇంట‌ర్నెట్ లో క్ష‌ణాల్లో ఇది వైర‌ల్ అయింది. రాజ్ వీర్ క్రిటిసిజానికి చాలా మంది మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇది చెత్త సినిమా! అని కొంద‌రు వ్యాఖ్యానించారు. 'వార్ 2'లో ఒక మంచి విష‌యం లార్డ్ బాబీ అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇప్పుడే స్పైవర్స్ ని ముగించాలి అని మ‌రొక‌రు కామెంట్ చేసారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2, 2019 హిట్ వార్ కి సీక్వెల్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఆరవ భాగం. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.