Begin typing your search above and press return to search.

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్.. మరోసారి రెచ్చిపోతూ వీడియో రిలీజ్!

ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   27 Feb 2026 9:47 AM IST
లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్.. మరోసారి రెచ్చిపోతూ వీడియో రిలీజ్!
X

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ తో యూట్యూబర్ గా పేరు దక్కించుకున్నారు అన్వేష్. అలాగే రెండు ఇంస్టాగ్రామ్ ఛానల్స్ ను కూడా కొనసాగిస్తూ వివిధ దేశాలను తిరుగుతూ.. అక్కడి విషయాలను అ ఫాలోవర్స్ తో పంచుకుంటూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రపంచ దేశాలు తిరుగుతూ యూట్యూబర్ గా కెరియర్ కొనసాగిస్తున్న అన్వేష్.. గత కొంతకాలంగా పలు అంశాలపై చర్చిస్తూ విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ కేసులో తలదూర్చిన ఈయన.. ఆ తర్వాత గత ఏడాది ఆఖరిలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక అలాగే గరికపాటి వ్యాఖ్యలను విమర్శించడమే కాకుండా హిందూ దేవీ దేవత మూర్తులపై అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేశారు.

అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు..

ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనికి తోడు సినీనటి కరాటే కళ్యాణి కూడా అన్వేష్ పై కేసు ఫైల్ చేసింది. ఇక అన్వేష్ అక్కడితో ఆగకుండా మరొకసారి తన వీడియోలతో రెచ్చిపోయాడు. తనను ఎవరు ఏమి చేయలేరు అంటూ వీడియోలు రిలీజ్ చేశాడు. పైగా ఒక ఇన్స్టా బ్లాక్ అయింది అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈయన.. వెంటనే ఆ ఇన్స్టా బ్లాక్ అయినప్పటికీ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని కామెంట్లు చేశారు. ఇక అంతటితో ఆగకుండా తన ఇన్స్టా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే డి యాక్టివేట్ అయిందని చెప్పి కామెంట్లు చేశారు. ఇక దీంతో కరాటే కళ్యాణి రెండో రోజుల్లో లుక్ అవుట్ నోటీసులు పంపించి నిన్ను ఇండియాకు రప్పిస్తానంటూ కామెంట్లు చేసింది. అన్నట్టుగానే దర్యాప్తు వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు అన్వేష్ కి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనికి తోడు అతని రెండు యూట్యూబ్ ఛానల్స్ ను, రెండు ఇంస్టా ఖాతాలను బ్లాక్ చేసే విధంగా యూట్యూబ్, ఇన్స్టా లకు లేఖలు కూడా రాయనున్నట్లు స్పష్టం చేశారు.

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్..

అయితే ఇప్పుడు తాజాగా ఈ లుకౌట్ నోటీసులపై అన్వేష్ స్పందిస్తూ ఊహించని కామెంట్లు చేయడంతో సంచలనంగా మారింది. అసలు అన్వేష్ ఇలా మాట్లాడడం పద్ధతిగా లేదు అని కొంతమంది మండిపడుతున్నారు. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన 89 కేసులు, కేసీఆర్ పై 9 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి పై 29 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వారి రాజకీయాల మీద ఎఫిడవిట్ ఆధారంగా ఇస్తారు. నా మీద ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. అందులో మొదటి కేసు 2024లో పడింది. గోవాలో జరిగిన బెట్టింగ్ గ్యాంగ్ పై 41 రోజుల పోరాటం తర్వాత నాపై కేసు వేశారు. తలా తోక లేనిది కాబట్టి అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

100 కేసులు పెట్టిన ఏం చేసుకోలేరు..

2025లో మళ్లీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో ట్రైన్ పైన ఎందుకు బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారని అడిగినందుకు నాపై కేసు వేశారు. న్యాయం, ధర్మం మన వైపు ఉంది కాబట్టి అందులో కూడా గెలుస్తాను. 2026లో గరికపాటి చేసిన వ్యాఖ్యలను నేను ఇంగ్లీషులో మాట్లాడాను. ఆయన అన్నదే నేను అన్నాను. కాకపోతే ఆయన పైన కేసు వేయలేదు. నాపై కేసు వేశారు.. చట్టాన్ని, గవర్నమెంట్ ని, పోలీసు ఆఫీసర్ లని నేను అందర్నీ గౌరవిస్తాను.. కానీ నాపై ఎవరైతే తప్పుడు కేసులు వేస్తున్నారో వారు నన్నేం చేయలేరు. నాపై 100 కేసులు పెట్టినా సమస్య లేదు.. నా దగ్గర 8 కోట్ల డబ్బు ఉంది. ముగ్గురు సుప్రీంకోర్టు లాయర్లు, ముగ్గురు హైకోర్టు లాయర్లు ఉన్నారు. 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు . మతోన్మాదాలను సృష్టిస్తున్న వారి అంత చూడడమే నా టార్గెట్.

ఇండియాకు వస్తాను కానీ..

నేను ఇండియాకి వస్తాను కాకపోతే 2035 వరకు నా పాస్పోర్ట్ ఉంది. రెన్యువల్ చేయించుకోవడానికి అప్పుడు వస్తాను. ఇంకా 140 దేశాలు తిరుగుతాను" అంటూ రెచ్చిపోతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.