Begin typing your search above and press return to search.

చిరంజీవి సినిమాకి సంగీతమంటే జోక్ అనుకున్నా!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌నకి ఛాన్స్ రావ‌డం ప‌ట్ల స్పందించారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:16 AM GMT
చిరంజీవి సినిమాకి సంగీతమంటే జోక్ అనుకున్నా!
X

మెగాస్టార్ చిరంజీవికి సంగీతం అందించ‌డం అంటే చిన్న విష‌యమా? సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంతో అనుభ‌వం ఉండాలి. గ్రేట్ స‌క్సెస్ ట్రాక్ క‌లిగి ఉండాలి. అన్నింటికి మించి ట్రెండింగ్ లో ఉండాలి. ఇవేవి లేకుండా ఛాన్స్ అన్న‌ది అంత ఈజీ కాదు. అలా జ‌ర‌గాలంటే అద్భుతాలు జ‌ర‌గాల్సిందే. అలాంటి వండ‌ర్ యువ సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర‌ సాగ‌ర్ విష‌యంలో జ‌రిగిందొనొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ స్టార్ హీరోకి సినిమాకి సంగీతం అందించ‌లేదు. కేవ‌లం యంగ్ హీరోల సినిమాల‌కే ప‌నిచేసాడు. అది ప‌ది-ప‌దిహేను సినిమాలుంటాయి. అయితే వాటిలో కొన్ని బెస్ట్ మ్యూజిక్ చిత్రాలున్నాయి.

అన్నింటికి మించి `ఛ‌లో` అత‌ని కెరీర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బ‌మ్ గా నిలిచింది. ఆ సినిమా మ‌హ‌తికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడీ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంజీవి క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న `భోళా శంక‌ర్` కి సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా చిరు సినిమాకి సంగీతం అందించ‌డం అత‌నికి కూడా ఎంతో సర్ ప్రైజ్ గా ఉంద‌ని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌నకి ఛాన్స్ రావ‌డం ప‌ట్ల స్పందించారు.

` క‌ల నిజ‌మైంది అంటారు కదా. దాన్ని మించిన ఆనందాన్ని ఇచ్చిన అవ‌కాశం ఇది. తెర‌పై చిరంజీవి క‌నిపిస్తే అలా చూస్తూ ఉండిపోవ‌డం అల‌వాటు. ఇప్పుడు ఆయ‌న సినిమాకి సంగీతం అందిస్తున్నానని తెలిసిన‌ప్పుడు న‌మ్మ‌డానికి నాకే స‌మ‌యం ప‌ట్టింది. ఆరోజు మా ఇంట్లో మానాన్న పుట్టిన రోజు సంద‌డి జ‌రుగుతుంటే ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ ఇంటికొచ్చారు. అప్పుడే చిరంజీవితో సినిమా చేస్తున్నాం. నువ్వే సంగీత ద‌ర్శ‌కుడు అన్నారు. అది విని నేను జోక్ అనుకున్నా. ఆ త‌ర్వాత పిలిచి కథ చెప్పి ఇలా చేద్దాం అన్నారు.

దీంతో న‌న్ను నేనే న‌మ్మ‌లేక‌పోయాను. న‌మ్మ‌లేని నిజం అంటే ఇదేనేమో అనిపించింది. సాధార‌ణంగా నేనెవ‌రి స‌ల‌హాలు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ను. క‌థ‌ల‌కి త‌గ్గ‌ట్టు నా సౌండ్ ట్రాక్స్ నేనే సిద్దం చేసుకుంటా. కీబోర్డ్ ప్లేయార్ గా కీర‌వాణి..క‌ల్యాణ్ మాలిక్..మా నాన్న ఇలా చాలా మంది ద‌గ్గ‌ర ప‌నిచేసా. వాళ్ల ప్ర‌భావం నాపై బ‌లంగా ఉంది. కానీ ఈ సినిమా విష‌యంలో నాన్న స‌ల‌హాలు తీసుకున్నా. ట్యూన్ చేసి ఇది స‌రిపోతుందా? ఇంకా ఏమైనా చేయాలా? అని అడిగేవాడిని. ఆయ‌నకి ఏది అనిపిస్తే అది చెపేవారు. ఈసినిమాలో మోడ్ర‌న్ సౌండ్ ని వినిపించే ప్ర‌య‌త్నం చేసా` అని అన్నారు.