Begin typing your search above and press return to search.

సినిమా తీస్తానంటే డబ్బులు పోగొట్టుకుంటావ్ అన్నారు..!

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పార్క్ లైఫ్.

By:  Tupaki Desk   |   12 Nov 2023 4:08 AM GMT
సినిమా తీస్తానంటే డబ్బులు పోగొట్టుకుంటావ్ అన్నారు..!
X

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పార్క్ లైఫ్. ఈ సినిమాకు కథ, కథనం, డైరెక్టర్ అన్నీ తానై నడిపించాడు. తొలి సినిమాతోనే చాలా పెద్ద బాధ్యత మీద వేసుకున్నాడు విక్రాంత్. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన స్పార్క్ సినిమా లో మెహ్రీన్, రుక్సర్ థిల్లాన్ లు హీరోయిన్లుగా నటించారు. సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషల్లో ఈ నెల 17న స్పార్క్ లైఫ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం నాడు ఈ సినిమా నుంచి ఈవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్ లైఫ్ పేరుతో ఒక స్నీక్ పీక్ రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్ లో హీరో కమ్ డైరెక్టర్ విక్రాంత్ స్పీచ్ కూడా అదరగొట్టాడు. ముందుగా చంద్రమోహన్ గారి మరణం చాలా బాధాకరం. ఎన్నో గొప్ప పాత్రలను ఆయన పోషించారు. ఆయన లేని లోటు తీరనిది అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఇప్పటివరకు స్పార్క్ సినిమాలో ప్రేమ, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ ని చూపించాం. ఇంతవరకు చూపించకుండా ఓ సర్ ప్రైజ్ ను దాచేశాం. లైఫ్ అనేది స్పార్క్ క్యాప్షన్. స్పార్క్ నుంచి ఈవిల్ చూపించాం. మెహ్రీన్ రుక్సర్ ఈ సినిమాకు వంద శాతం న్యాయం చేశారని విక్రాంత్ అన్నారు.

తాను ఇండియాకు వచ్చి సినిమా తీస్తానంటే.. డబ్బులు పోగొట్టుకుంటావ్ అని అందరు అన్నారు. కానీ మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. ఈ ప్రయాణంలో నన్ను ఒక్కరు ప్రోత్సహిస్తే 99 మంది నిరుత్సాహపరిచారు. వారంతా కూడా నా మీద ఉన్న ప్రేమతో అలా అన్నారు. కానీ తలదించుకుని పనిచేశా.. వారంతా నా లోని ఫైర్ ను ఇంకా రగిల్చినట్టుగా అనిపించింది. ఎంకరేజ్ చేసిన వారీ, విమర్శించిన వారికి థాంక్స్. నవంబర్ 17న తలెత్తే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇస్తాడని ఆశిస్తున్నానని అన్నారు విక్రాంత్. ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న పిల్లాడిలా ఎదురుచూస్తున్నాం. మేం తీసిన సినిమా మాకు బాగానే ఉంటుంది. కానీ ప్రేక్షకులకు నచ్చడమే అసలు సిసలైన విజయమని అన్నారు. మా ఈ సినిమా జనాలకు నచ్చాలని కోరుకుంటున్నానని విక్రాంత్.

హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. స్పార్క్ సినిమాతో విక్రాంత్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ అండ్ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాకు మీ సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు తనని మహాలక్ష్మిగా, హనీగా ఆదరించారు. ఈ సినిమాలో లేఖ పాత్రను కూడా అందరు మెచ్చుకుంటారని అన్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ కావాలి. మీ ప్రేమ అభిమానాలే మా అందరికీ ప్రోత్సాహమని అన్నారు.

సినిమాలో నటించిన మరో హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ కూడా సినిమా కోసం విక్రాంత్ అన్ని విధాలుగా పనిచేశారు. సెట్ లో ఎన్నో సమస్యలను ఆయన తెలివిగా పరిష్కరించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని అన్నారు.