Begin typing your search above and press return to search.

తక్కువ మార్కెట్.. ఎక్కువ రెమ్యునరేషన్.. ఎందుకింత గ్యాప్?

ఇక మిగతా రెండు చిత్రాలు కూడా మొదలై చాలా కాలమే అవుతోంది. కానీ ఇప్పటికీ మూడో షెడ్యూల్‌లోకి వెళ్లలేకపోయాయి.

By:  Tupaki Desk   |   8 July 2025 8:45 AM IST
తక్కువ మార్కెట్.. ఎక్కువ రెమ్యునరేషన్.. ఎందుకింత గ్యాప్?
X

టాలీవుడ్‌లో మంచి బాలుడు అనే గుర్తింపు తెచ్చుకున్న ఓ యువ హీరో.. గత కొన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. వ‌రుస ఫ్లాప్‌లు, మార్కెట్ డ్రాప్‌ వల్ల కొత్త సినిమాలకు బజ్ తగ్గిపోయింది. అయినప్పటికీ, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గకుండా డబుల్ డిజిట్‌ డిమాండ్ చేస్తున్నాడట.

ఈ హీరో ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. రెండు చిత్రాలు ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా జానర్‌లో ఉంటే.. మూడోది మాస్ మసాలా ఎంటర్‌టైనర్. ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. అందులో రెండు ఏడాది క్రితమే ప్రారంభమైన ఈ సినిమాలు ఇంకా మధ్యలోనే ఉండిపోయాయి. కారణం ఒక్కటే.. ఆర్థిక ఇబ్బందులు.

ఈ సినిమాల నిర్మాతలు ఇప్పటికే బడ్జెట్ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ హీరో అడిగిన అడ్వాన్స్ అమౌంట్‌ను సమకూర్చలేకపోతుండటంతో షూటింగ్ ఆగిపోయింది. ఓ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయ్యాక జూన్ నుంచే ఆగిపోయింది. నిర్మాత ముందస్తుగా సెట్ చేసిన డేట్‌కు హీరో హాజరుకాలేదు. ఆయన అడిగిన ముందస్తు చెల్లింపుల విషయంలో క్లారిటీ రాకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.

ఇక మిగతా రెండు చిత్రాలు కూడా మొదలై చాలా కాలమే అవుతోంది. కానీ ఇప్పటికీ మూడో షెడ్యూల్‌లోకి వెళ్లలేకపోయాయి. అంతేకాదు, ఏ డిజిటల్ డీల్ కానీ, థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ కానీ ఇంకా ఖరారు కాలేదు. మార్కెట్ లెక్కలతో ఈ సినిమాల భవిష్యత్తుని రిస్క్ లో పడేశాయి. ఈ హీరో క్రేజ్‌ను చూసుకుని మొదట బలంగా దూసుకెళ్లిన నిర్మాతలు ఇప్పుడు ప్లాన్ మార్చుకుంటున్నట్టు సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. మార్కెట్‌కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఫ్లెక్సిబుల్‌గా తీసుకుంటేనే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయగలిగే అవకాశముంటుంది. లేదంటే ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. ఇప్పుడు ఈ యువ హీరో పరిస్థితి కూడా అదే దిశగా వెళ్తోందనే చెప్పాలి. వీటికి తోడు రీసెంట్‌గా చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నెగిటివ్ రెస్పాన్స్‌ పొందడం వల్ల డిస్ట్రిబ్యూషన్ సెటిల్మెంట్స్ ఆలస్యం అవుతున్నాయి. దాంతో మిగిలిన సినిమాలపై కూడా ప్రభావం పడుతోంది. ఆరు నెలలుగా ఈ హీరో నుండి షూటింగ్ చేసిన ఏ సినిమా అప్డేట్ బయటకి రాకపోవడం ఒక పెద్ద నెగెటివ్.

మొత్తానికి.. మార్కెట్ పరంగా వెనకబడుతున్న హీరోలు కూడా ప్లానింగ్ విషయంలో అర్థవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గుడ్ విల్ ఒక్కటే కాకుండా, ప్రాజెక్టుల సజావుగా నడవడానికీ ఇది కీలకం. ఇప్పుడు ఈ మూడు సినిమాల పరిస్థితిని బట్టి చూస్తే.. హీరో ఆలోచనల్లో మార్పు లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చని అనిపిస్తోంది.