ఎంసెట్ ఎగ్జామ్ ముందు రోజు సినిమాకెళ్లిన హీరో!
ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలన్నీ పాజిటివ్ గా వచ్చాయి.
By: Tupaki Desk | 11 May 2025 1:28 PM ISTయంగ్ హీరో శ్రీ విష్ణు గురించి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా రాణిస్తు న్నాడు. ఇండస్ట్రీలో నారా రోహిత్ మంచి స్నేహితుడు. రోహిత్ హీరోగా పరిచయమైన 'బాణం'తోనే శ్రీవిష్ణు కూడా లాంచ్ అయ్యాడు. అందులో అకాడమీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అటుపై రోహిత్ సహా వివిధ స్టార్లు నటించిన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో శ్రీవిష్ణుకు మంచి పేరొచ్చింది.
అప్పటి నుంచి హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన 'సింగిల్' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలన్నీ పాజిటివ్ గా వచ్చాయి. దీంతో శ్రీవిష్ణు ఖాతాలో మరో సక్సెస్ షురూ అయినట్లే. పోటీగా కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు ఏకైక ఏంటర్ టైనర్ గా మారింది. ఆ సంగతి పక్కనబెడితే?
శ్రీవిష్ణు కూడా క్లాస్ లకు..కాలేజీలకు డుమ్మా కొట్టిన హీరోనే. ఈ విషాయన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కాలేజీకి సెలవులు పెట్టడం సినిమాలకు వెళ్లడం ఓ రేంజ్ లో చేసేవాడినన్నారు. ఎంసెట్ ఎగ్జామ్ ముందు రోజు ఏకంగా సినిమాకెళ్లొచ్చినట్లు తెలిపాడు. చేతిలో బస్ చార్జీ లేకపోవడంతో ఎంసెట్ హాల్ టికెట్ చూపిస్తే కండెక్టర్ టికెట్ కొట్టడని ఓ స్నేహితుడు చెబితే? అదే హాల్ టికెట్ చూపించి కండెక్టర్ చేతిలో భంగపడినట్లు గుర్తు చేసుకున్నాడు.
చదువుల్లో అంతత మాత్రమే. క్రికెట్ లో అండర్ 19 వరకూ వెళ్లినట్లు తెలిపాడు. క్రికెట్ అంటే చిన్నప్పటి నంచి ఇష్టమైన ఆట కావడంతో ఎక్కువగా టోర్నమెంట్ లు ఆడినట్లు తెలిపాడు. అంతకు మించి పైకి వెళ్లే సీన్ లేకపోవడంతో అక్కడితో క్రికెట్ కి ముగింపు పలికాడుట. ఆ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టుకున్నది లేదన్నాడు. అదే ఎక్స్ పీరియన్స్ అప్పట్లో ఒకటుండేవాడు చిత్రానికి పనికొచ్చిందన్నాడు.
