శర్వానంద్ లైనప్ లో 37 మిస్సింగ్!
అయితే వాటి తాజా అప్ డేట్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. 36-38 చిత్రాల సంగతి పక్కన బెడితే మధ్యలో 37వ చిత్రం ఏమైనట్లు?
By: Tupaki Desk | 27 April 2025 5:46 AMయంగ్ హీరో శర్వానంద్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. సరైన కమర్శియల్ హిట్ పడి చాలా కాలమవుతుంది. దీంతో యంగ్ హీరో రేసులో బాగా వెనుకబడ్డాడు. తోటి హీరోలంతా పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉంటే? శర్వా ఇంకా అలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం యంగ్ హీరోలైనప్ లో మూడు సినిమాలున్నాయి. `నారీ నారీ నడుమమురారీ` లో నటిస్తున్నాడు.
ఇది శర్వానంద్ 35వ చిత్రం. అలాగే 36వ చిత్రం అభిలాష కంకర అనే కొత్త కుర్రాడితో చేస్తున్నాడు. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో యూవీ సంస్థ శర్వాకి హిట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే శర్వానంద్ 38వ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో లాక్ అయింది. 1960 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ కి సంబంధించిన కథగా తెలుస్తోంది.
ఇందులో శర్వానంద్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమాలన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వాటి తాజా అప్ డేట్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. 36-38 చిత్రాల సంగతి పక్కన బెడితే మధ్యలో 37వ చిత్రం ఏమైనట్లు? అవును ఈ సినిమా గురించి శర్వా వీకీలో ఎలాంటి సమాచారం లేదు. 37వ చిత్రం ఏ దర్శకుడితో చేస్తున్నాడు. నిర్మాతలెవరు? అన్నది మాత్రం కనిపిం చలేదు.
మరి ఈ చిత్రాన్ని శర్వానంద్ సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడా? అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ఎలాంటి లీకు లేకుండా చూసుకుంటున్నాడా? అన్నది తెలియాలి. ప్రస్తుతం యంగ్ హీరో `నారీ నారీ నడుమ మురారీ` షూటింగ్ లోనే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ గత ఏడాది `మనమే` చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే.