13 కోట్లలో నాలుగు కోట్లు తిరిగిచ్చేసాడా?
ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ టాలీవుడ్ లో ఓ యువ హీరోని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jun 2025 11:38 AM ISTఇటీవలే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ టాలీవుడ్ లో ఓ యువ హీరోని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ యంగ్ హీరో సినిమా రిలీజ్ అయితే రెండు కోట్లు కూడా షేర్ రాలే దని..అలాంటి హీరోని పిలిచి 13 కోట్లు పారితోషికంగా ఇచ్చామన్నారు. అప్పటి నుంచి ఆ హీరో ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అదే హీరో ఆ చిత్ర నిర్మాతలకు తిరిగి నాలుగు కోట్లు ఇచ్చేసాడు? అన్న వార్త వెలుగులోకి వస్తోంది.
సినిమాకి తన వల్ల నష్ట రావడంతో తీసుకున్న పారితోషికంలో నాలుగు కోట్లు వెనక్కి ఇచ్చేసి తనపై పెట్టిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని సదరు నిర్మాత ప్రస్తావించ లేదంటూ మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సినిమాలు సరిగ్గా అడని సమయంలో చాలా మంది హీరో లు తీసుకున్న పారితోషికంలో ఎంతో కొంత తిరిగి చెల్లిస్తుంటారు. అలా తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు.
కానీ దాతృ హృదయంతో హీరోలు ముందుకొచ్చి చెల్లిస్తుంటారు. టాలీవుడ్ హీరోలకు ఉన్న గొప్ప లక్షణం ఇది. సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోలు వరకూ చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుం టారు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని హీరోలంతా నమ్ముతారు. ఇండస్ట్రీ సమస్యలపై హీరో లంతా కలిసి కట్టుగా ముందుకు రాకపోయినా? నష్టాలొస్తే మాత్రం తమకు తోచింది ఏదో రూపంలో చేస్తుం టారు.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటిస్తోన్న సినిమాలకు సంబంధించి బ్యాలెన్స్ పారితో షికం తీసుకోని సంగతి తెలిసిందే. తన కారణంగా సినిమాలు డిలే అవ్వడంతో నిర్మాతలు కొంత నష్టాన్ని భరించారు. దీంతో ఆ నష్టాన్ని పీకే అలా భర్తీ చేసారు. ఇలాంటి నిర్ణయాల విషయంలో పవన్ డేరింగ్ వేరే లెవల్.