Begin typing your search above and press return to search.

తమ్ముడి కోసం స్టార్ మధ్యవర్తిత్వం

విజయన్ వివాహం నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:57 AM IST
తమ్ముడి కోసం స్టార్ మధ్యవర్తిత్వం
X

తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ఇంట పెళ్లి సందడి నెలకొంది. యోగిబాబు తమ్ముడు అయిన విజయన్‌ పెళ్లి స్వగ్రామం అయిన సెయ్యర్‌ లో సింపుల్‌ గా బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. విజయన్ వివాహం నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

యోగిబాబు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోక ముందు చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం చాలా ప్రయత్నించాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి యోగి బాబు వచ్చాడు. ప్రస్తుతం పదుల కోట్ల ఆస్తులను కూడబెట్టిన యోగిబాబు సోదరుడు విజయన్‌ ప్రేమ వివాహానికి కులం అడ్డు వచ్చింది.

యోగిబాబు డేట్లు మరియు సినిమాల వ్యవహారాలు చూసుకునే విజయన్ మరో వైపు దర్శకుడిగా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో విజయన్‌ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

విజయన్‌ తో వివాహానికి అమ్మాయి తరపు వారు నో చెప్పడంతో యోగిబాబు రంగంలోకి దిగాడు. స్వయంగా తానే అమ్మాయి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాడు. తన తమ్ముడి పెళ్లి కోసం తానే మధ్యవర్తిత్వం చేసి చివరకు అమ్మాయి తరపు వారిని ఒప్పించడం జరిగింది.

యోగిబాబు మధ్యవర్తిత్వంతో అమ్మాయి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్‌ గా వీరి వివాహం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది కూడా విజయన్‌ ప్రేమ వివాహానికి హాజరు అయ్యారు. జూన్‌ 3వ తారీకున ఈ వివాహం జరుగగా కాస్త ఆలస్యంగా మీడియాకు సమాచారం ఇచ్చి ఫోటోలు షేర్‌ చేశారు.