చింతకాయల రవి దర్శకుడు.. మళ్ళీ ఇన్నాళ్ళకు!
తెలుగు ప్రేక్షకులకు చింతకాయల రవి వంటి వినోదాత్మక చిత్రంతో గుర్తుండిపోయిన దర్శకుడు యోగి చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
By: Tupaki Desk | 6 April 2025 9:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు చింతకాయల రవి వంటి వినోదాత్మక చిత్రంతో గుర్తుండిపోయిన దర్శకుడు యోగి చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈసారి మాత్రం ఆయన కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా ఓ కంటెంట్ బేస్డ్ లేడీ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.
సమ్యుక్తా మీనన్ ఇప్పటికే కొన్ని పవర్ఫుల్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. ‘భీమ్లా నాయక్’ నుంచి ‘సార్’ వరకు ఆమె చేసిన పాత్రలు బాగానే హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా విరుపాక్ష సినిమాలో ఆమె నటనకు మరిన్ని ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఆమె యోగి దర్శకత్వంలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి భైరవీ లేదా రాక్షసి అనే టైటిల్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాత గతంలో విలక్షణ కథలతో విభిన్నమైన ప్రయోగాలు చేసిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు సంయుక్తను ఎంచుకోవడం ద్వారా, ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఎంత ఉందో అర్థమవుతోంది. మంచి సాంకేతిక బృందంతో సినిమాను నాణ్యతతో తెరకెక్కించాలనే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు యోగి గతంలో చాలా కామెడీ టచ్ ఉన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కానీ ఈసారి ఆయన ఎంచుకున్న కథ మాత్రం డిఫరెంట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సమాజంలో మహిళల సమస్యల నేపథ్యంలో, అంతర్లీనంగా ఒక సోషల్ మెసేజ్ ఉండేలా కథను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇందులో సంయుక్త పాత్ర పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి త్వరలోనే టైటిల్ విషయంలో అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరగనుండగా, ఈ సినిమాలో సమ్యుక్తకు జోడీగా ఒక యువ హీరో నటిస్తున్నట్లు టాక్. కానీ కథ మాత్రం పూర్తిగా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందట. మొత్తానికి చాలా కాలం తర్వాత డైరెక్టర్ యోగి మళ్లీ లైన్ లోకి అందులో సంయుక్త లాంటి ప్రతిభావంతమైన నటి ప్రధాన పాత్రలో ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.
