Begin typing your search above and press return to search.

యోధా ట్రైలర్: దేశం కోసం థ్రిల్లింగ్ హై ఆక్టేన్ మిషన్‌

ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 15 న విడుదలవుతోంది ఈ చిత్రం ట్రైలర్ ఫిబ్రవరి 29న‌ విడుదలైంది. గ్రిప్పింగ్ స్టోరీలో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటెన్స్ యాక్షన్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:09 PM GMT
యోధా ట్రైలర్: దేశం కోసం థ్రిల్లింగ్ హై ఆక్టేన్ మిషన్‌
X

బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా టీజర్ విడుదలైనప్పటి నుండి ప్ర‌శంస‌లు అందుకుంది. గ‌గ‌న‌విహారంలో టెర్ర‌ర్ (విమానం హైజాక్) నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిద‌ని టీజ‌ర్ తో అర్థ‌మైంది. ఇందులో మ‌ల్హోత్రా విమాన ప్ర‌యాణీకుల‌ను కాపాడే ఆర్మీ అధికారిగా న‌టించారు. రాశి ఖన్నా, దిశా పటానీ లాంటి అంద‌గ‌త్తెలు వైమానిక ద‌ళ సిబ్బందిగా క‌నిపిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 15 న విడుదలవుతోంది ఈ చిత్రం ట్రైలర్ ఫిబ్రవరి 29న‌ విడుదలైంది. గ్రిప్పింగ్ స్టోరీలో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటెన్స్ యాక్షన్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది.

కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ట్రైల‌ర్ ను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈ ట్రైలర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా తన తండ్రి అడుగుజాడల్లో సైనికుడిగా మారాక‌.. అత‌డికి ఎదురైన భారీ ఎసైన్ మెంట్ ఏమిట‌న్న‌ది ర‌క్తి క‌ట్టిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు పవర్-ప్యాక్డ్ డైలాగ్‌ల తో ట్రైల‌ర్ ఆస‌క్తిని పెంచింది. ముఖ్యంగా సీరియ‌స్ డ్రామాలో రాశీఖ‌న్నాతో అత‌డి ల‌వ్ రొమాంటిక్ ట్రాక్ ఆస‌క్తిని క‌లిగించింది. ట్రైల‌ర్ వీక్షకులలో ఉత్కంఠను రేకెత్తించింది. కరణ్ జోహార్ క్యాప్షన్‌లో ఇలా రాసాడు. మా #యోధ బాధ్యతలు స్వీకరించినందున ఇది థ్రిల్ చేసే స‌మ‌యం. బిగ్ స్క్రీన్స్‌లో కలుద్దాం!! మార్చి 15న యోధ సినిమా థియేటర్లలోకి వస్తుంది.. అని వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన‌ మొదటి రొమాంటిక్ సాంగ్ జిందగీ తేరే నామ్ యువ‌త‌రంలో వైర‌ల్ అయింది. సిద్ధార్థ్ - రాశి మ‌ధ్య రొమాన్స్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం ధర్మ ప్రొడక్షన్స్‌తో నా సుదీర్ఘ అనుబంధానికి సింబాలిక్ అని సిద్ధార్థ్ మ‌ల్హోత్రా అన్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుండి షేర్షా వరకు ఇప్పుడు యోధా వరకు మేము పనిచేసిన ప్రతి సినిమా క్లాస్ మాస్ ఇరు వ‌ర్గాల్లోనూ మార్మోగింది. యోధ నిస్సందేహంగా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది.. అని అన్నారు. ఇది కాకుండా సిద్ధార్థ్ చివరిసారిగా శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్‌లతో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు.