Begin typing your search above and press return to search.

యోధ.. 1+1 ఆఫర్ వర్కౌట్ అయ్యేనా?

దీంతో రెండో రోజు నుంచి జనాలను థియేటర్లకు రప్పించడానికి వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   16 March 2024 5:40 PM GMT
యోధ.. 1+1 ఆఫర్ వర్కౌట్ అయ్యేనా?
X

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ, టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'యోధ‌'. కొత్త దర్శకులు సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా సంయక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై కరణ్‌ జోహర్‌ నిర్మించారు. శుక్రవారం (మార్చి 15) థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా, బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

'యోధ' క‌థేంటంటే: తండ్రి స్ఫూర్తితో యోధా టాస్క్‌ఫోర్స్‌లో క‌మాండోగా చేరిన అరుణ్ క‌టియాల్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా) దూకుడుగా మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆప‌రేష‌న్స్‌లో పాల్గొనే క్ర‌మంలో కొన్నిసార్లు నిబంధ‌న‌ల్ని కూడా అతిక్ర‌మిస్తుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి.అయిన అతని భార్య ప్రియంవ‌ద క‌టియాల్ (రాశీఖ‌న్నా)తో కలిసి హ్యాపీగా జీవనం సాగిస్తుంటాడు. అయితే అరుణ్ చేప‌ట్టిన ఓ మిషన్ ఫెయిల్ అవ్వడంతో ఉగ్ర‌వాదుల చేతుల్లో ఒక సైంటిస్ట్ హ‌త్య‌కి గుర‌వుతాడు. దీంతో అరుణ్ ఆ పదవిని వదిలి ఎయిర్ క‌మాండోగా దిల్లీ నుంచి లండ‌న్ వెళ్లే విమానంలో ప్రయాణం చేస్తాడు. అరుణ్ ని వాడుకొని భారత ప్రభుత్వం దగ్గర డిమాండ్లు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్న టెర్రరిస్టులు, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్టుల ప్లాన్ ని అరుణ్ ఎలా ఛేదించాడు? వారి కుట్ర‌ల‌ని ఎలా తిప్పికొట్టాడు? అనేదే ఈ సినిమా కథ.

విమానాల హైజాక్ నేపథ్యంలో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా 'ఆకాశ వీధిలో', 'గగనం' లాంటి సినిమాలు ఇదే బ్యాక్ డ్రాప్ లో రూపొందాయి. ఇప్పుడు అదే ఫ్లైట్ హైజాక్ కథాశంతో.. కొన్ని మలుపులు, విభిన్న‌మైన యాక్ష‌న్‌ సన్నివేశాలతో 'యోధ' సినిమా తెరకెక్కింది. చెప్పుకోడానికి ఏమాత్రం కొత్త‌ద‌నం లేని ఈ క‌థలో.. ఏరియ‌ల్ వ్యూతో కూడిన సీన్స్, ఫ్లైట్ లో ఫైట్ సీన్స్, ట్విస్టులు ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్స్ మెప్పిస్తాయి. కాకపోతే సన్నివేశాలన్నీ ముందే ఊహించే విధంగా ఉండటంతో ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేయడం లేదు. విమానంలో ఉన్న ఉగ్ర‌వాదులు ఎవ‌ర‌నేది తెలిసిన‌ప్ప‌టి నుంచి పెద్దగా ఆసక్తిని కలిగించే స‌న్నివేశాలేవీ లేకపోవడం మైనస్ గా చెబుతున్నారు.

'షేర్‌షా' త‌ర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా 'యోధ' సినిమా ద్వారా మ‌రోసారి త‌న‌లోని యాక్ష‌న్ కోణాన్ని చూపించారు. రాశీ ఖన్నా ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో నటించినప్పటికీ, సిద్దార్థ్ తో ఆమె ట్రాక్ రొటీన్ గా సాగింది. కల్కి భామ దిశా పటాని స్పెషల్ యాక్షన్ రోల్ లో సర్ప్రైజ్ చేసింది. ఇందులో రోనిత్‌ రాయ్‌, తనూజ్ విర్వానీ, సన్నీ హిందూజా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఓవరాల్ గా దర్శక ద్వయం సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా ట్విస్టులతో కూడిన క‌థ‌నం రాసుకున్న‌ప్ప‌టికీ, కొత్త‌ద‌నాన్ని పంచడంలో విఫలం అయినట్లుగా ప్రేక్ష‌కులు తీర్మానించారు.

'యోధ' టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వసూళ్లు ఉన్నాయి. ఫస్ట్ డే రూ. 4.25 కోట్లు కలెక్షన్స్ రాబడినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండో రోజు నుంచి జనాలను థియేటర్లకు రప్పించడానికి వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ వీకెండ్ లో 'షైతాన్' నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. అజయ్ దేవగన్, జ్యోతిక, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు సాధిస్తోంది. ఆదివారం నాటికి 100 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 'యోధ' సినిమాకి అర్బన్ ఏరియాల్లో శనివారం ఈవెనింగ్ షోల నుంచి ఫుట్ ఫాల్స్ పెరిగినట్లుగా తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లో ఏ మేరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.