'ఎల్లమ్మ' బిజీ వల్లే అలా జరిగిందా?
ఎల్లమ్మ.. కొంత కాలంగా టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన మూవీ అది. ఎందుకంటే కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారిన వేణు ఎల్దండి వహిస్తుండడం కారణం.
By: M Prashanth | 5 March 2026 12:08 PM ISTఎల్లమ్మ.. కొంత కాలంగా టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన మూవీ అది. ఎందుకంటే కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారిన వేణు ఎల్దండి వహిస్తుండడం కారణం. డెబ్యూ మూవీ బలగంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. సినిమాలో చూపించిన గ్రామీణ జీవితం, భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో వేణు సెకెండ్ ప్రాజెక్టు ఎల్లమ్మపై అందరి దృష్టి పడింది.
ముఖ్యంగా ఆ సినిమాలో హీరో ఎవరనేది మొన్నటి వరకు కూడా ఫిక్స్ కాలేదు. ఆ ప్రాజెక్ట్ కోసం నాని, ఆ తర్వాత నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఖరారయ్యారు. సినిమాలో ఆయన ఒక డప్పు కళాకారుడి (పర్షి) పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఆ విషయాన్ని రివీల్ చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామ దేవత రేణుక ఎల్లమ్మ నేపథ్యంలో ఒక ఎమోషనల్ రూరల్ డ్రామాగా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. గ్లింప్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎల్లమ్మ మూవీలో నటిస్తూ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందిస్తున్నారు.
అదే సమయంలో వివిధ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు సినిమాలకు పని చేస్తున్నారు. దీంతో డీఎస్పీ.. ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. నెల రోజుల్లో పది రోజులు మాత్రమే ఎల్లమ్మ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మిగతా 20 రోజులు.. తన మ్యూజిక్ వర్క్ ను చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కు పాటలు అందిస్తున్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సమకూర్చడం లేదు. ఆయన బదులు తమన్ రంగంలోకి దిగారు. ఆ విషయాన్ని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసి.. దేవిశ్రీ ఇప్పటికే అంగీకరించిన ఇతర ప్రాజెక్టుల కారణంగా ఉస్తాద్ కు మరింత సమయం కేటాయించలేకపోతున్నారని, అందుకే పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఆ ఇతర ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది ఎల్లమ్మ అనే చెప్పాలి. తొలిసారి లీడ్ రోల్ లో నటిస్తుండడమే కాకుండా.. మ్యూజిక్ కూడా అందిస్తున్నారు. దీంతో ఆ సినిమాకు చాలా వర్క్ చేయాల్సి ఉంది. దానికి తోడు ఆ మూవీ.. 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ మొగ్గు చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఎల్లమ్మకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలా ఎల్లమ్మ బిజీ వల్ల ఉస్తాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో డ్రాప్ అయ్యారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా నిజమేంటనేది మాత్రం ఆయనకే తెలియాలి.
