ఏ మాయ చేసావె... సైలెంట్‌గా రావాల్సిందేనా?
అంతే కాకుండా శోభిత ను వివాహం చేసుకున్న తర్వాత ఏ మాయ చేసావె సినిమా కి ప్రమోషన్‌కి వెళ్తే తప్పుడు మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 20 Jun 2025 1:00 AM ISTఅక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్యకు మొదటి హిట్‌గా ఏమాయ చేసావె నిలుస్తుంది. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. నాగ చైతన్యతో పాటు సమంతను టాలీవుడ్‌లో స్టార్‌లుగా నిలపడంలో ఆ సినిమా కీలక పాత్ర పోషించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ వసూళ్లు రాబట్టింది. ఈ మధ్య కాలంలో కల్ట్ హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే సినిమా ప్రమోషన్ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలు అయింది. ఈ సినిమా ప్రమోషన్ కి నాగ చైతన్య, సమంత హాజరు కావడం లేదు.
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరూ ప్రస్తుతం తమ పర్సనల్ లైఫ్‌లో సంతోషంగా ఉన్నారు. నాగ చైతన్య ఇప్పటికే శోభిత ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొత్త జీవితంను ఎంజాయ్ చేస్తున్నాడు. వారిద్దరూ కలిసి త్వరలోనే సినిమాలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం గురించి పక్కన పెడితే సమంత సైతం కొత్త జీవితం ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన క్లారిటీ మాత్రం సమంత ఇవ్వలేదు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న కారణంగా, సమంత సైతం రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
ఒక వైపు ఈ రచ్చ జరుగుతున్న సమయంలో వీరిద్దరు కలిసి 'ఏ మాయ చేసావె' సినిమా ప్రమోషన్‌కి హాజరు కావడం అనేది కచ్చితంగా అసాధ్యం. ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏ మాయ చేసావె సినిమా ప్రమోషన్‌కి హాజరు కాబోనను అంది. తాను ఏ సినిమా ప్రమోషన్ కోసం వెళ్లడం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతే కాకుండా శోభిత ను వివాహం చేసుకున్న తర్వాత ఏ మాయ చేసావె సినిమా కి ప్రమోషన్‌కి వెళ్తే తప్పుడు మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరిద్దరూ సినిమా ప్రమోషన్‌కి దూరంగా ఉండబోతున్నారు.
హీరో, హీరోయిన్ ప్రమోషన్ లేకుండా సినిమాను రీ రిలీజ్ చేయడం ద్వారా ఏ మేరకు ఫలితం ఉంటుంది అనేది చూడాలి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్‌కి పెద్దగా ప్రమోషన్ అక్కర్లేదు. కానీ ఏ మాయ చేసావె లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు కచ్చితంగా ప్రమోషన్ అవసరం. కానీ ఈ సినిమాకు వారిద్దరు ప్రమోషన్ కి హాజరు కావడం లేదు. ఇతర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా ప్రమోషన్‌కి హాజరు అయ్యే పరిస్థితి లేదు. అందుకే సైలెంట్‌గా ఈ సినిమా రీ రిలీజ్ కావాల్సిందే అని, పెద్దగా హడావుడి లేకుండానే సినిమా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఏ మాయ చేసావె సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.
ఆ క్రేజ్‌తో ఈ సినిమా జనాల్లోకి వెళ్లాల్సి ఉంది. పెద్దగా పోటీ లేని సమయంలో రాబోతున్న ఈ సినిమాకు కచ్చితంగా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. జులై 18న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా వచ్చిన వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్‌కి ముందు వారం అనుష్క నటించిన ఘాటీ విడుదల కాబోతుంది.
