మహేష్ హీరోగా...చిరంజీవి గెస్ట్ గా!
నాగచైతన్య-సమంత జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన `ఏమాయ చేసావే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2025 7:00 PM ISTనాగచైతన్య-సమంత జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన `ఏమాయ చేసావే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. చై-సమంత కెరీర్ అప్పుడే ప్రారంభమైంది. రెండవ చిత్రంగా లవ్ స్టోరీ చేయడం ఊహించని సక్సెస్ సాధించడంతో చైతన్యకు లవర్ బోయ్ గా మారిపోయాడు. ఇప్పటీక అదే ఇమేజ్ తో కొనసాగుతున్నాడు. అక్కినేని వారసత్వానికి లవర్ బోయ్ ఇమేజ్ అనేది ఓ బ్రాండ్ లాంటింది. ఏఎన్నార్ తర్వాత నాగార్జునకు ఆ తర్వాత చైతన్యకు ఆ ఇమేజ్ వచ్చింది.
అలా 'ఏమాయ చేసావే' అక్కినేని కాంపౌండ్ కి ఓ ప్రత్యేక చిత్రం గా మారింది. చైతన్య ఎన్ని సినిమాలు చేసినా? ఎన్ని హిట్లు కొట్టినా? చైతన్య కెరీర్ కి 'ఏమాయ చేసేవే' అన్నది ఓ క్లాసిక్ హిట్. అయితే ఈ చిత్రం లో హీరో తొలుత నాగచైతన్య కాదు. సూపర్ స్టార్ మహేష్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని మహేష్ తో గౌతమ్ తీయాలనుకున్న విషయాన్ని బయట పెట్టారు. మహేష్ ని ఊహించుకునే ఈ కథ రాసినట్లు తెలిపారు. అలాగే సినిమా క్లైమాక్స్ భిన్నంగా ప్లాన్ చేసారట.
ఓ పెద్ద హీరో గెస్ట్ రోల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆ పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాలను కున్నా రుట. కానీ ఆ రెండు జరగలేదన్నారు. చివరికి నాగచైతన్యకు వినిపించి సినిమా తీసినట్లు తెలిపారు. 'ఏమాయా చేసావే' విడుదలై జూలై 18 కి 15 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా చిత్రాన్ని మళ్లీ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ-రిలీజ్ లకు మంచి రెస్పాన్స వస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'ఏమాయ చేసావే' రీ-రిలీజ్లో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వానికి దూరంగా ఉంటూ నడుడిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వరుస వైఫల్యా లతో ఆయన కెప్టెన్ కుర్చీకి బధులు మ్యాకప్ వేసుకుని నటుడిగా మారిపోయారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు...గెస్ట్ రోల్స్ తో అలరిస్తున్నారు.
