Begin typing your search above and press return to search.

వైసీపీకి ఫుల్ జోష్ ని తెచ్చే యాత్ర -2 టీజర్ వచ్చేస్తోంది...!

యాత్ర-2 టీజర్ జనవరి 5న రిలీజ్ కాబోతోంది. దీంతో వైఎస్సార్ అభిమానులతో పాటు వైసీపీ వర్గాలలోనూ ఎంతో ఆసక్తి ఉత్సాహం కనిపిస్తొంది. ఈ టీజర్ కి ముందు పెట్టిన కాప్షన్ కూడా ఆలోచింపచేసేలా ఉంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 3:20 PM GMT
వైసీపీకి ఫుల్ జోష్ ని తెచ్చే యాత్ర -2 టీజర్ వచ్చేస్తోంది...!
X

యాత్ర-2 టీజర్ జనవరి 5న రిలీజ్ కాబోతోంది. దీంతో వైఎస్సార్ అభిమానులతో పాటు వైసీపీ వర్గాలలోనూ ఎంతో ఆసక్తి ఉత్సాహం కనిపిస్తొంది. ఈ టీజర్ కి ముందు పెట్టిన కాప్షన్ కూడా ఆలోచింపచేసేలా ఉంది. వన్ మ్యాన్ ఏ మిలియన్ ఓడ్స్, ఎట్ ద ప్రామిస్ హాడ్ టు బి కెప్ట్ అని రాశారు.


ఇక వైఎస్సార్ వేషధారిగా కుర్చీలో దర్జాగా మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ ముమ్ముట్టి కూర్చుంటే ఆయన పక్కన జగన్ పాత్రధారి కోలీవుడ్ స్టార్ జీవా నిలబడి ఉన్నారు. యాత్ర -1 గత ఎన్నికల ముందు విడుదల అయి డీసెంట్ హిట్ గా నిలిచింది. యాత్ర మూవీ బయోపిక్ గా కాకుండా కళ్ళ ముందు నిండు వైఎస్సార్ జీవితాన్ని ఆవిష్కరించింది. దాంతో ఆడియన్స్ కానీ వైఎస్సార్ ఫ్యాన్స్ కానీ పూర్తిగా సంతృప్తి చెందారు.

దానికి కొనసాగింపుగా వస్తున్న యాత్ర -2 టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మరో మూడు రోజుల వ్యవధిలో టీజర్ వస్తోంది. దీంతో వైసీపీలో కొత్త హుషార్ కనిపిస్తోంది. యాత్ర-2 పూర్తిగా వైఎస్ జగన్ జీవితాన్ని వెండి తెర మీద ఆవిష్కృతం చేయనుంది. వైఎస్సార్ మరణించిన దగ్గర నుంచి ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం, ఆయన చేసిన మూడున్నర వేలకు పైబడి పాదయాత్ర వంటివి యాత్ర-2 లో కనిపించనున్నాయి. ఒక విధంగా జగన్ ఫ్యాన్స్ కి యాత్ర-2 ఫుల్ మీల్స్ అని చెప్పాల్సి ఉంటుంది.

యాత్ర -1న వైఎస్సార్ రాజకీయ జీవితాన్ని మొత్తం చూపించిన తీరులోనే అనేక ఆసక్తికరమైన అంశాలతో యాత్ర -2 సిద్ధం అవుతోంది. యాత్ర -1 సూపర్ హిట్ అయింది. ఈ బయోపిక్ ని ఎంతో నేర్పుగా తీసిన డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ్‌ ఇపుడు యాత్ర -2తో ఒక్కసారిగా ఆశలను పెంచేశారు. వెండి తెర మీద తనదైన మ్యాజిక్ ని మరోసారి ఆయన చూపించడం ఖాయం అంటున్నారు.

ఇక యాత్ర -2 కి సంబంధించి ఇప్పటిదాకా వచిన అప్ డేట్స్ అన్నీ చిత్రం మీద ఆశలను అంచనాలను విపరీతంగా పెంచేస్తునాయి. ఇక ఈ టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసి మేకర్స్ సినిమా మీద మరింత హోప్స్ పెంచేశారు. డైరెక్టర్ గా చూస్తే మ‌హి వి.రాఘ‌వ్‌ ది సక్సెస్ ఫుల్ ట్రాక్ గా చెప్పాలి.ఆయన పాఠ‌శాల‌, ఆనందోబ్ర‌హ్మ‌, యాత్ర వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తోపాటు సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్షకులను అలరించారు.

ఒక వైపు ఏపీలో రాజకీయం హీటెక్కి ఉంది. మరో డెబ్బై రోజులలో ఎన్నికలు ఉన్న వేళ ఫిబ్రవరి 8న యాత్ర-2 సినిమా రానుంది. ఈ మూవీ కచ్చితంగా ఆడియన్స్ అంచనాలు అందుకుని గ్రాండ్ సక్సెస్ కొడుతుందని అంటున్నారు. దాంతో వైసీపీ శ్రేణులు అంతా యాత్ర-2 మీద ఫుల్ కాంఫిడెన్స్ తో ఉన్నారు. టీజర్ చెప్పే ముచ్చట్లు ఏంటి అన్నది మరో మూడు రోజులలో వెల్లడి అవుతుంది అంటున్నారు.