Begin typing your search above and press return to search.

యాత్ర 2: వాళ్ళ రెమ్యునరేషన్స్ ఏ రేంజ్ లో అంటే..

తమిళ్ యాక్టర్ జీవాకి ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. అలాగే మమ్ముట్టికి 3 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:43 AM GMT
యాత్ర 2: వాళ్ళ రెమ్యునరేషన్స్ ఏ రేంజ్ లో అంటే..
X

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం యాత్ర 2. ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ మూవీకి ఎక్కువగా వైసీపీ సపోర్టర్స్ నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. కామన్ ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చెప్పలేని విషయం.

వాస్తవాలకి దగ్గరగా మహి వి రాఘవ కథ చెబితే కచ్చితంగా జనరల్ ఆడియన్స్ పొలిటికల్ కథలని ఆదరిస్తారు. అయితే అందులో ఫిక్షనల్ ఎలిమెంట్స్ ని జోడించి డ్రామా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాత్ర సినిమా విషయంలో మహి వి రాఘవ అలాంటి పొరపాట్లు చేయలేదు. అందుకే ఆ మూవీ అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యింది. అలాగే వైఎస్ ఆర్ మరణాంతరం ఆ మూవీ రావడం కూడా సక్సెస్ కి ఒక కారణం అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే యాత్ర 2 మూవీ కోసం నిర్మాత ఏకంగా 50 కోట్లు ఖర్చు చేసారంట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ తక్కువ అయిన రెమ్యునరేషన్ ల ద్వారానే ఎక్కువ మొత్తం ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సినిమాలో వైఎస్ జగన్ పాత్రని చేసిన తమిళ్ యాక్టర్ జీవాకి ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. అలాగే మమ్ముట్టికి 3 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇలా రెమ్యునరేషన్ ల రూపంలోనే 25 కోట్ల వరకు సినిమాకి ఖర్చయ్యిందంట. మిగిలిన మొత్తం సినిమా మీద పెట్టినట్లు సమాచారం. మహి వి రాఘవ మేకింగ్, కంటెంట్ నేరేషన్ లో మంచి ఎక్స్ పర్ట్. ఆ విషయాన్ని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు.

ఫిబ్రవరి 8న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈగల్ కి పోటీగా వస్తోన్న కూడా యాత్ర2 కోసం వెయిట్ చేసే ఆడియన్స్ మాత్రం ఉన్నారు. ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందనే దానిని బట్టి మహి వి రాఘవ చెప్పిన కంటెంట్ ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అయ్యిందో అంచనా వేయవచ్చు.