Begin typing your search above and press return to search.

యాత్ర-2లో షర్మిల పాదయాత్ర కట్?.. డైరెక్టర్ రియాక్షన్

అయితే ఈ మూవీలో జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటిస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Jan 2024 6:45 PM GMT
యాత్ర-2లో షర్మిల పాదయాత్ర కట్?.. డైరెక్టర్ రియాక్షన్
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కొడుకు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు సొంత పార్టీని జగన్ ఎందుకు స్థాపించారు? ఆ సమయంలో రాష్ట్రంలో ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే యాత్ర 2 మూవీ చూడాల్సిందే. డైరెక్టెర్ మహీ వి రాఘవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.

అయితే ఈ మూవీలో జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటిస్తున్నారు. మరి ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పాత్ర ఉంటుందా? అని ఇటీవలే నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఈ సినిమా నుంచి షర్మిల క్యారెక్టర్ ను కత్తిరించేశారని పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. షర్మిల చేపట్టిన పాదయాత్రను షూట్ చేసి.. ఇప్పుడు ఎడిటింగ్ లో తీసేస్తున్నారు అని టాక్ వైరల్ అయ్యింది.

ఇప్పుడు ఈ వార్తలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు డైరెక్టర్ మహి వి రాఘవ. ఓ సంస్థ రాసిన వార్తను ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. "ఓహ్, మా సినిమాకు స్క్రిప్ట్, డైరెక్షన్ తోపాటు ఎడిటింగ్‌లో సహకరించినందుకు నేను మీకు క్రెడిట్ ఇవ్వకపోతే క్షమించండి. సినిమా కోసం ఏంటి షూట్ చేశామో మీకు తెలిసిపోయినట్లుంది. ఇన్ఫర్మేషన్, ఇమేజినేషన్ కు చాలా తేడా ఉంది. దయచేసి మన పనులను మనం ఎక్ఛేంజ్ చేసుకోవద్దు. సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.

అయితే యాత్ర-2 ట్రైలర్ గమనిస్తే.. జగన్, భారతి పాత్రలు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేశ్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ నటించారు. కానీ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు ఏం చేశాడు? అనేది యాత్ర 2లో మెయిన్ పాయింట్ అని తెలిసింది.

కేవలం జగన్ జీవితంలో కొన్ని అంశాలు తీసుకుని సినిమా చేయడంతో.. వైఎస్ షర్మిల పాత్రకు ఆస్కారం లేదని సమాచారం. యాత్ర సినిమాలోనూ ఆమె రోల్ లేదు. కథ, క్యారెక్టర్ల విషయంలో పక్కాగా ఉండే మహి వి రాఘవ్.. యాత్ర-2 స్టోరీ డిమాండ్ మేరకు క్యారెక్టర్లు రాసుకున్నారట. జగన్ రాజకీయ ప్రయాణం మీద మాత్రమే దర్శకుడు పూర్తిగా కాన్సంట్రేట్ చేశారట. కేవలం తండ్రి కొడుకుల అనుబంధం మాత్రమే చూపించాలని అనుకున్నారట. అసలు విషయం తెలియాలంటి సినిమా రిలీజ్ అయిన వరకు వేచి చూడాల్సిందే.