Begin typing your search above and press return to search.

యాత్ర2.. అసలు గేమ్ షురూ

మమ్ముట్టి టైటిల్ రోల్ లో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Oct 2023 10:49 AM GMT
యాత్ర2.. అసలు గేమ్ షురూ
X

మమ్ముట్టి టైటిల్ రోల్ లో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా 2019 ఎన్నికలకి ముందు రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత యాత్ర 2 సినిమాని మహి వి రాఘవ తెరకెక్కిస్తున్నార.


వైఎస్ మరణాంతరం జగన్ చేసిన ఓదార్పు యాత్ర ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ యాత్ర 2 మూవీని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ్ యాక్టర్ జీవా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో వచ్చే ఎన్నికలలో ఎంతో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ నాలుగేళ్ల పాలనని ఈ చిత్రంలో చూపించే అవకాశం లేదంట.

వచ్చే ఎన్నికల లోపు యాత్ర 2 సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో యాత్ర మూవీని కూడా ఫిబ్రవరి 8, 2019న రిలీజ్ చేశారు. ఇప్పుడు యాత్ర 2 కి కూడా అదే డేట్ ని మహి వి రాఘవ ఫిక్స్ చేయడం విశేషం. మొదటి సినిమా సెంటిమెంట్ ని ఈ మూవీలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.

యాత్ర 2లో కూడా వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి కొద్ది సేపు కనిపిస్తాడంట. ఆయన మరణాన్ని కూడా మూవీలో చూపించబోతున్నారాణి తెలుస్తోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. యాత్ర తరహాలోనే యాత్ర 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. అయితే మొదటి సినిమా వైసీపీని గెలుపులో ఎంతో కొంత భాగస్వామ్యం అయ్యింది.

మరి యాత్ర 2 కూడా మరోసారి జగన్ ని అధికారంలోకి తీసుకొస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మహి వి రాఘవన్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని నాలుగేళ్ల తర్వాత మరల యాత్ర 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైసీపీ వ్యతిరేకుల నుంచి వినిపిస్తోంది.