Begin typing your search above and press return to search.

యాత్ర 2 డిలిటెడ్ సీన్.. జనాలు నమ్ముతారా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం వాతావరణం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:54 PM GMT
యాత్ర 2 డిలిటెడ్ సీన్.. జనాలు నమ్ముతారా?
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం వాతావరణం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ తరుణంలో పాలిటిక్స్ కు తగ్గట్టుగా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హడావిడి చేస్తూ ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో వచ్చిన యాత్ర సినిమా మినిమం రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమాలో ఉన్న విషయాల కన్నా కూడా దర్శకుడు మహీ వి రాఘవ మేకింగ్ విధానం చాలా మంది ని ఆకట్టుకుంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కథలో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈసారి యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 వైయస్ జగన్ బయోపిక్ ను తెరపైకి తీసుకువచ్చాను. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ ఏమి అందుకోలేదు. ఇక చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ తో హడావిడి బాగానే చేసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

అయితే కీలకమైన కొన్ని పాత్రలు మాత్రం వెండితెరపై కనిపించలేదు. ముఖ్యంగా వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ పాత్రలు సినిమాలో లేవని ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇక చంద్రబాబు క్యారెక్టర్ ను హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు మంజ్రేకర్ బాబు పాత్రలో నటించారు. సినిమాలో డిలీట్ చేసిన ఒక సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

యాత్ర 2 సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వైఎస్ జగన్ పార్టీ పెట్టి రాజకీయంగా సరికొత్త అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక వైయస్ మరణించిన సమయంలో దాన్ని సెంటిమెంట్ గా వాడుకుంటే అతనే సీఎం అవుతాడు అని మిగతా ప్రతిపక్ష నేతలు చెప్పడం ఆ తర్వాత బాబు పాత్ర వచ్చి అదే అతనికి బలం అయితే దాన్ని బలహీనంగా మార్చాలి అని సూచించిన విధానం మరింత హైలైట్ అవుతుంది.

మన అనుకూల మీడియా ద్వారా అతను సంతకాల సేకరణ చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడు అని హైలెట్ చేయాలి అని బాబు క్యారెక్టర్ సూచిస్తున్నట్లుగా చెప్పాడు. ఇక జనాలు నమ్ముతారా అనే తరహాలో ఆ సీన్ లో డైలాగ్ మరింత హైలెట్ అయ్యింది. మరి ఇది రాజకీయంగా ఎలాంటి కాంట్రవర్సీకి దారితీస్తుందో చూడాలి.