Begin typing your search above and press return to search.

ఆ సినిమాకంటే ముందే సీక్వెల్!

య‌శ్ రాజ్ స్పై యూనివ‌ర్స్ లో భాగంగా `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Feb 2024 12:30 AM GMT
ఆ సినిమాకంటే ముందే సీక్వెల్!
X

య‌శ్ రాజ్ స్పై యూనివ‌ర్స్ లో భాగంగా `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ ని ఒకే ప్రేమ్ లో చూపిస్తూ అద్భుత‌మైన స్పై చిత్రంగా దీన్ని మ‌ల‌చ‌డానికి య‌శ్ రాజ్ ఫిలింస్ భారీ ఎత్తున స‌న్నాహాలు చేస్తుంది. సినిమా కోసం టాప్ టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దించి ఓరేంజ్ లో మార్కెట్ లోకి వ‌ద‌లాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆ సినిమా కి సంబంధిం చిన ప‌నులు ప్రారంభమ‌య్యాయి.

సల్మాన్..షారుక్ ఖాన్ వీలును బ‌ట్టి చిత్రాన్ని వీలైనంత వేగంగా సెట్స్ కి తీసుకెళ్లాల‌ని య‌శ్ రాజ్ ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కంటే ముందుగా ప‌ఠాన్ -2 ని ప‌ట్టాలెక్కించాల‌ని య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు స‌మాచారం. షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప‌ఠాన్` బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో తెలిసిందే.

1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. సిద్దార్ధ్ ఆనంద్ అదే టీమ్ తో `ప‌ఠాన్ 2`ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ఠారెత్తిపోతుంది. తాజాగా దీనికి సంబంధించి మ‌రో సాలిడ్ అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సీక్వెల్ ని య‌శ్ రాజ్ ఫిలింస్ `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కంటే ముందుగానే ప్రారంభించాల‌ని భావిస్తోందిట‌.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రారంభించింద‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే గ‌నుక ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లనుందని వినిపిస్తుంది. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్ లో ఇదొక కీలక చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా కోసం స‌ద‌రు నిర్మాణ సంస్థ 500 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.