Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ KGF రిస్క్ చేస్తున్న యశ్.. ఫ్యాన్స్ షాక్..!

K.G.F మొదటి రెండు పార్ట్ లతో నేషనల్ వైడ్ రికార్డులను సృష్టించిన కన్నడ స్టార్ యశ్ ఆ సినిమాల తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడా అని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఏర్పడింది

By:  Tupaki Desk   |   22 Sep 2023 8:53 AM GMT
ఆఫ్టర్ KGF రిస్క్ చేస్తున్న యశ్.. ఫ్యాన్స్ షాక్..!
X

K.G.F మొదటి రెండు పార్ట్ లతో నేషనల్ వైడ్ రికార్డులను సృష్టించిన కన్నడ స్టార్ యశ్ ఆ సినిమాల తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడా అని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఏర్పడింది. కె.జి.ఎఫ్ 2 వచ్చి ఏడాది కావొస్తున్నా సరే యశ్ తన తర్వాత సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమధ్య తన నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ గురించి అనౌన్స్ చేసిన యశ్ ఆ సినిమా డైరెక్టర్ ఎవరన్నది కూడా చెప్పలేదు.

లేటెస్ట్ గా ఆఫ్టర్ కె.జి.ఎఫ్ యశ్ తన తర్వాత సినిమా డైరెక్ట్ ని ఫిక్స్ చేసుకున్నారు. మలయాళ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో యశ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించాలని చూస్తుంది. అయితే ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే సినిమాకు హీరో యశ్ కూడా సహ నిర్మాతగా ఉంటున్నాడట. ఈమధ్య హీరోలంతా కూడా తమ రెమ్యునరేషన్ బదులుగా సినిమా నిర్మాణంలో భాగం అవడమో లేక ఏదైనా ఏరియా రైట్స్ తీసుకోవడం జరుగుతుంది.

యశ్ కూడా ఆ ప్లాన్ లో భాగంగానే సహ నిర్మాతగా ఉంటున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్ లో తనకంటూ ఒక భారీ మార్కెట్ ని ఏర్పరచుకున్న యశ్ నిర్మతగా కూడా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ సినిమా గోవా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకోగా త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు సినిమా బడ్జెట్ లాంటి విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ గా కూడా భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి యశ్ నెక్స్ట్ మూవీ ఎంత పెద్ద స్కేల్ లో రాబోతుంది అన్నది చూడాలి. యశ్ తో తెలుగు స్ట్రైట్ సినిమా కోసం మన మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన కథ దొరకనిదే సినిమా చేసేది లేదని అతను అంటున్నాడట. నిర్మాతలేమో ముందు అడ్వాన్స్ ఇచ్చి అతన్ని బుక్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ స్టోరీ ఫైనల్ అయితేనే అది కూడా తన రేంజ్ కు తగ్గ బడ్జెట్ పెట్టేలా ఉంటేనే సినిమా చేయాలని చూస్తున్నాడు యశ్. సో తనకు వచ్చిన ఈ పాన్ ఇండియా క్రేజ్ తో కెరీర్ మీద యశ్ బాగానే ప్లానింగ్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది.