Begin typing your search above and press return to search.

యష్.. ఇంకా ఎన్ని రోజులిలా?

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని రాకింగ్ స్టార్ యష్ సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:30 AM GMT
యష్.. ఇంకా ఎన్ని రోజులిలా?
X

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని రాకింగ్ స్టార్ యష్ సొంతం చేసుకున్నారు. ఇండియా మొత్తం అతని వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్ యష్ అని చెప్పొచ్చు. కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రిలీజ్ అయ్యి ఏడాదిన్న కాలం అయ్యింది. ఇప్పటి వరకు అతని కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

కేజీఎఫ్ సిరీస్ కి ముందు యష్ తన సినిమాల విషయంలోఎప్పుడూ కూడా ఇంత గ్యాప్ తీసుకోలేదు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2తో యష్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ కారణంగా నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కచ్చితంగా కేజీఎఫ్ సిరీస్ కి మించి ఉండాలని అనుకుంటారు. అందుకే ఆచితూచి కథల ఎంపిక చేసుకునే పనిలో యష్ ఉన్నారు.

హిందీలో తెరకెక్కనున్న రామాయణం సిరీస్ లో రావణుడి పాత్రకి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం నడిచింది. అధికారికంగా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అలాగే మలయాళంలో సినిమాలు చేస్తోన్న నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. యష్ స్టొరీని ఫైనల్ చేసాడని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనే టాక్ నడిచింది. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ఇప్పటి వరకు ప్రకటన రాలేదు.

అలాగే ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ నార్తన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం నడిచింది. వీటిలో ఏ ఒక్కటి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అభిమానులు మాత్రం యష్ నెక్స్ట్ సినిమా గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా నిరాశతో ఉన్నారు. అయితే యష్ దీనిపై కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంగా కొత్త సినిమాపై తన అభిప్రాయం చెప్పారు. అభిమానులని ఎంటర్టైన్ చేయడం కోసం తాను కష్టపడుతున్నా అని త్వరలోకి మీ అందరిని సంతోషపెట్టే వార్త కచ్చితంగా చెబుతానని అన్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషి చేసే వార్త యష్ ఎప్పుడు చెబుతాడు అనేది ఆసక్తికరంగా మారింది.