Begin typing your search above and press return to search.

యష్.. ఈసారి ఎలాంటి సినిమా అంటే...

గోవా నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందంట. అందులో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 3:42 AM GMT
యష్.. ఈసారి ఎలాంటి సినిమా అంటే...
X

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో అతని నెక్స్ట్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న యష్ సుదీర్ఘ విరామం తర్వాత తన కొత్త మూవీపైకి వెళ్లబోతున్నాడు. కొద్ది రోజుల క్రితం యష్ 19 మూవీ మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో చేయబోట్ఝున్నట్లు సమాచారం బయటకొచ్చింది. అఫీషియల్ గా అయితే ఎనౌన్స్ చేయలేదు.

కానీ ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఫైనల్ గా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడం జరిగిందని తెలుస్తోంది. యష్ కూడా కథ మొత్తం చూసి లాక్ చేసారంట. ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఉందంట. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ స్టొరీ లైన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోవా నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందంట. అందులో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో యష్ చేయబోయే పాత్ర ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు. మాఫియా డీలర్ లేదంటే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అయిన యష్ కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

కథ భాగా నచ్చడంతోనే గీతూ మోహన్ దాస్ కి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ఆమె యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత దర్శకురాలిగా మారింది. దీనికంటే ముందుగా గీతూ మోహన్ దాస్ నివిన్ పోలీతో మూతోన్ అనే మూవీ చేసి హిట్ కొట్టింది. ఈ మూవీ కూడా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ఉండటం విశేషం.

ఈ మూవీలో బాలీవుడ్ లో రానిస్తోన్న తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ కూడా నటించింది. 2019లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏకంగా రాకింగ్ స్టార్ యష్ నే డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చాలా కథలు విని గీతూ మోహన్ దాస్ కి ఒకే చెప్పాడంటేనే స్టొరీలో ఎంతో దమ్ముండాలి.