Begin typing your search above and press return to search.

KGF3 వెంట‌నే తీయ‌క‌పోవ‌డం భారీ త‌ప్పిద‌మా?

అయితే కొంత‌కాలంగా జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌, లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ తో ప‌ని చేసేందుకు య‌ష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి

By:  Tupaki Desk   |   13 Sep 2023 4:05 AM GMT
KGF3 వెంట‌నే తీయ‌క‌పోవ‌డం భారీ త‌ప్పిద‌మా?
X

కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల‌తో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ సంచ‌ల‌నాలు సృష్టించాడు. ఈ ఫ్రాంఛైజీ ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ కి అసాధార‌ణ‌ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. భార‌త‌దేశంలో టాప్ 10లో నిలిచే మ‌రో ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా నీల్ సుప‌రిచితం అయ్యాడు. కేజీఎఫ్ తో హోంబ‌లే సంస్థ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తొలి రెండు భాగాలు సాధించిన అసాధార‌ణ విజ‌యాల నేప‌థ్యంలో వెంట‌నే కేజీఎఫ్ 3ని కూడా హోంబ‌లే సంస్థ‌ ప్రారంభిస్తుంద‌ని అభిమానులు భావించారు. కానీ అది వీలు ప‌డ‌లేదు.

దానికి కార‌ణం ప్ర‌శాంత్ నీల్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స‌లార్ ని ప్రారంభించ‌డం, అలాగే టాలీవుడ్ లో వ‌రుస‌గా అగ్ర హీరోల‌తో ప్రాజెక్టుల‌కు క‌మిట్ మెంట్లు ఉండ‌డంతో ఇప్ప‌ట్లో రాకింగ్ స్టార్ య‌ష్ తో ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చా సాగుతోంది. అంతేకాదు.. కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో మూడో భాగాన్ని కూడా ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే తెర‌కెక్కించి ఉంటే ఎంతో బావుండేద‌ని, ఇదే వేడిలో మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ సాధ్య‌ప‌డేద‌ని ఈ ఫ్రాంఛైజీ అభిమానులు విశ్లేషిస్తున్నారు. కానీ ప్ర‌శాంత్ నీల్ నుంచి అందుకు గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. మ‌రోవైపు హోంబ‌లే సంస్థ భారీ లైన‌ప్ తో ఎంతో బిజీగా ఉంది. ఇవ‌న్నీ కేజీఎఫ్ 3 ఆల‌స్యానికి కార‌ణాలుగా భావించాలి. అయితే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. నిర్మాతలు బిజీగా ఉన్నా కానీ, ఇప్ప‌టివ‌ర‌కూ య‌ష్ మ‌రో కొత్త సినిమాని ప్రారంభించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కేజీఎఫ్ 2 విడుద‌లై చాలా కాల‌మే అయ్యింది. కానీ య‌ష్ ఇంకా చ‌ల‌నం లేకుండా ఉన్నాడు. త‌న కొత్త‌ సినిమాని ప్రారంభించ‌లేదు.

అయితే కొంత‌కాలంగా జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌, లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ తో ప‌ని చేసేందుకు య‌ష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ ప్రాజెక్ట్ లాంచింగ్ పై ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా స‌మాచారం మేర‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో గీతు మోహన్‌దాస్ తో యష్ షూటింగ్ ప్రారంభించనున్నార‌ని తెలుస్తోంది. యష్ 19 ప్ర‌స్తుతానికి వ‌ర్కింగ్ టైటిల్. తాజా స‌మాచారం ప్రకారం... యష్ -గీతు మోహన్‌దాస్ కాంబో మూవీ డిసెంబరు 2023 నుండి సెట్స్ కి వెళ్లేందుకు అవ‌కాశం ఉంది. ప్రస్తుతం ప్రిపరేషన్ వర్క్ జరుగుతోంది. త‌దుప‌రి యష్ పై అనేక లుక్ టెస్ట్‌లు జ‌ర‌గ‌నున్నాయి''అని సోర్స్ వెల్ల‌డించింది.

కేజీఎఫ్ స‌క్సెస్ త‌ర్వాత అమాంతం చాలా మారింది. ఇప్పుడు య‌ష్ పై బిగ్ బెట్టింగ్ సాగుతోంది. అందుకే త‌దుప‌రి యష్ ఎలాంటి సినిమాలో న‌టిస్తాడో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌థ‌పై క‌స‌ర‌త్తు సాగుతోంది. నటుడిగా ప్రిపరేషన్ దశలోకి వెళ్లడానికి య‌ష్‌ సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్‌లో సినిమాని ప్రారంభిస్తాడు'' అని సోర్స్ చెబుతోంది. గీతు గ‌తంలో 'లయర్స్ డైస్', 'ది ఎల్డర్ వన్' వంటి చిత్రాలతో పాపుల‌ర‌య్యారు. రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.