Begin typing your search above and press return to search.

​ యశ్ హాలీవుడ్ కనెక్షన్.. అనుకున్నదే నిజమైందిగా

వివరాళ్లోకి వెళితే.. హాలీవుడ్‌ స్టండ్ డైరెక్టర్​ జేజే పెర్రీతో కలిసి రాకింగ్ స్టార్ యశ్‌ దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:20 PM GMT
​  యశ్ హాలీవుడ్ కనెక్షన్.. అనుకున్నదే నిజమైందిగా
X

కేజీయఫ్ రాక్ స్టార్​ యశ్‌.. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్​లో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే కేజీయఫ్ 2 సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ.. యశ్ తన నెక్ట్స్​ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్​ మెంట్​ చేయలేదు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

వివరాళ్లోకి వెళితే.. హాలీవుడ్‌ స్టండ్ డైరెక్టర్​ జేజే పెర్రీతో కలిసి రాకింగ్ స్టార్ యశ్‌ దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా యశ్ తన కొత్త సినిమా కోసం ఓ హాలీవుడ్ స్టంట్‌ దర్శకుడు దగ్గర మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ఫొటో మరింత బలం చేకూర్చింది. యశ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసిన పెర్రీ.. లండన్‌లో నా సోదరుడుతో అంటూ వ్యాఖ్య రాసుకొచ్చారు. దీంతో యశ్‌ తర్వాత సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి.

కాగా, జేజే పెర్రీ.. హాలీవుడ్​లో భారీ విజువల్ వండర్ జేమ్స్​ కామెరూన్ అవతార్‌తో పాటు పలు ఇంగ్లీష్ సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేశారు. దీంతో యశ్‌ కొత్త చిత్రం కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుందంటూ సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో యశ్‌ డిఫరెంట్ లుక్‌లో సరికొత్తంగా కనిపించనున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్​ అక్టోబర్‌ నెలలో వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ షురూ చేస్తారని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

రెండు సార్లు నేషనల్ అవార్డ్​ అందుకున్న మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, ఎలాంటి కథలో వస్తుందో, అసలు ఎప్పుడూ ప్రారంభం అవుతుందో...