Begin typing your search above and press return to search.

ఆలస్యంపై క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్

సోషల్ మీడియాలో కూడా నిత్యం యష్ ని అడుగుతూ ఉంటారు. అయితే రాకింగ్ స్టార్ మాత్రం తన అభిమానులని నిరాశ పరుస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:51 AM GMT
ఆలస్యంపై క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్
X

కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటన రాలేదు. దీనిపై అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా నిత్యం యష్ ని అడుగుతూ ఉంటారు. అయితే రాకింగ్ స్టార్ మాత్రం తన అభిమానులని నిరాశ పరుస్తూనే ఉన్నారు. కొత్త సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో యష్ నెక్స్ట్ సినిమా కోసం చాలా మంది పేర్లు వినిపించాయి.

అయితే ఫైనల్ గా మలయాళీ విమెన్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె దర్శకత్వంలోనే యష్ నెక్స్ట్ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాలలో దీనిపై ఒక స్పష్టత ఉంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ పై పాన్ ఇండియా స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ప్రభాస్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఆ ఇమేజ్ ని కొనసాగించాలంటే యష్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ కచ్చితంగా కేజీఎఫ్ సిరీస్ కి మించి ఉండాలి. ఈ హై ఎక్స్ పెక్టేషన్స్ కారణంగానే యష్ నెక్స్ట్ సినిమా ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రాకింగ్ స్టార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

తన నుంచి అభిమానులు చాలా ఆశిస్తూ ఉంటారని, ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయని, ఏదో తొందర పడి హాఫ్ బెక్డ్ ఫుడ్ ఇవ్వడం తనకి ఇష్టం లేదని చెప్పాడు. పెర్ఫెక్ట్ స్టొరీ, ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే కంటెంట్ కోసం చూస్తున్న అని ఈ కారణంగానే ఆలస్యం అవుతుందని చెప్పాడు. అభిమానులు కాస్తా ఓపిక పడితే త్వరలోనే గొప్ప సినిమా అందించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.

దీనిని బట్టి యష్ సినిమా కథల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ రాఖీభాయ్ ఇంపాక్ట్ కచ్చితంగా యష్ నెక్స్ట్ సినిమాపై ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం పడిన ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోవచ్చు. అందుకే సుదీర్ఘ గ్యాప్ తీసుకొని గీతూ మోహన్ దాస్ కథపైన అతను వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందనేది చూడాలి.