Begin typing your search above and press return to search.

యష్.. మళ్ళీ KGF ఫార్మాట్ లోనే..

మలయాళీ ఫీమేల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.

By:  Tupaki Desk   |   3 May 2024 1:49 PM GMT
యష్.. మళ్ళీ KGF ఫార్మాట్ లోనే..
X

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కొన్ని నెలల క్రితం క్లారిటీ ఇచ్చాడు. మలయాళీ ఫీమేల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఈ సినిమాకి టాక్సిక్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.

కన్నడంలో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోన్న కేవీఎన్ ప్రొడక్షన్స్, మోనిస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొంత వర్క్ షాప్ అనంతరం ఈ సినిమా ప్లాన్ ఒక కొలిక్కి వచ్చింది. హీరో యష్ పక్కా ప్లాన్ సిద్ధమైన తరువాతే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. KGF లాంటి సక్సెస్ అనంతరం వస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అలాగే కేజీఎఫ్ ఫార్ములాని టాక్సిక్ చిత్రానికి కూడా అమలు చేస్తున్నారంట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఫిక్షనల్, యాక్షన్ జోనర్ లోనే ఈ మూవీ ఉండబోతోంది. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా యష్ గ్రే షేడ్స్ ఉన్న హీరోగానే కనిపించబోతున్నాడంట.

ఈ మూవీ షూటింగ్ ని తాజాగా కర్ణాటకలో మొదలు పెట్టారంట. ఈ సందర్భంగానే టాక్సిక్ మూవీ రెండు భాగాలుగా ఉండబోతోందని చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. రాకింగ్ స్టార్ యష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ మూవీ కూడా దేశ వ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ముగ్గురు స్టార్ యాక్టర్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. కరీనా కపూర్, కియారా అద్వానీ, శృతి హాసన్ లలో ఒకరిని కన్ఫర్మ్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. టాప్ ప్రయారిటీలో కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. త్వరలో హీరోయిన్ తో పాటుగా ఇతర క్యాస్టింగ్ కి సంబందించిన క్లారిటీ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

టాక్సిక్ టైటిల్ కి తగ్గట్లుగానే మాఫియా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని భావిస్తున్నారు. మలయాళంలో యాక్టర్ గా ప్రయాణం స్టార్ట్ చేసిన గీతూ మోహన్ దాస్ తరువాత దర్శకురాలిగా మారి ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఈ రెండు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మూడో సినిమాగా టాక్సిక్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో చేస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో బయటకి రానున్నాయి.