Begin typing your search above and press return to search.

యశ్ ఫ్యాన్స్ అల్లు హీరోలపై ఇలా ఎగబడ్డారేంటి?

మీ ఫ్యామిలీలో హీరోలు వచ్చినట్లుగా బ్యాగ్రౌండ్ తో యశ్ రాలేదు. మరి యశ్ పవర్ఫుల్ హీరో కాబట్టే KGF ఆ రేంజ్ లో హిట్ అయ్యింది అని కౌంటర్లు ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Nov 2023 7:32 AM GMT
యశ్ ఫ్యాన్స్ అల్లు హీరోలపై ఇలా ఎగబడ్డారేంటి?
X

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు కొన్ని అంశాలపై జనాల రియాక్షన్ ఊహించిన విధంగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ ఏ తరహాలో గొడవ పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎవరైనా నార్మల్ గా ఒక విషయాన్ని చెప్పినా దాని నెగిటివ్గా ఆలోచిస్తూ మరింతగా రాద్దాంతం కూడా చేస్తున్నారు.

కన్నడ హీరో యశ్ ఫ్యాన్స్ ఇటీవల కాలంలో తమ హీరోలను ఎవరు తక్కువ చేసి మాట్లాడారు అనిపించిన కూడా అస్సలు ఊరుకోవడం లేదు. ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్లో రవితేజ అందరి హీరోల గురించి మాట్లాడుతూ యశ్ గురించి కూడా ఒక వివరణ ఇచ్చాడు. అతడి సినిమాల్లో కేజీఎఫ్ మాత్రమే చూశాను అని అలాంటి సినిమా దొరకడం అతని అదృష్టము అన్నట్లుగా తనదైన శైలిలో తెలియజేశాడు.

నిజానికి రవితేజ అన్న దాంట్లో పెద్దగా తప్పు ఏమీ లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దాన్ని నెగటివ్ గా తీసుకుని సోషల్ మీడియాలో రవితేజ పై నెగిటివ్ పోస్టులు పెట్టడమే కాకుండా టైగర్ నాగేశ్వరరావు గురించి కూడా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవరకు వెళ్ళింది. ఇక ఇప్పుడు అదే తరహా లో అల్లు అరవింద్ చేసిన కొన్ని కామెంట్స్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఆయన వారసులపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.

ఇంతకీ అల్లు అరవింద్ ఏమున్నారు అంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం వల్లనే నిర్మాతలపై బడ్జెట్ భారం పెరుగుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు నిజానికి ఈ రోజుల్లో హీరోలు 30 శాతం నుంచి 25% కంటే తక్కువే తీసుకుంటున్నారు. కేవలం సినిమాలను గ్రాండ్ గా చూపించాలి అనే ఆలోచనతో బడ్జెట్ అనేది పెంచుతున్నారు.

ఉదాహరణకు KGF రాకముందు ఆ హీరో ఎవరికి తెలుసు. సినిమా గ్రాండ్ గా ఉండటం వలన ఆ స్థాయిలో రిజల్ట్ వచ్చింది అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. ఇక ఆయన ఆ విధంగా వివరణ ఇవ్వడం తో యశ్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహంతో అల్లు హీరోలను కూడా టార్గెట్ చేస్తున్నారు.

మీ ఫ్యామిలీలో హీరోలు వచ్చినట్లుగా బ్యాగ్రౌండ్ తో యశ్ రాలేదు. మరి యశ్ పవర్ఫుల్ హీరో కాబట్టే KGF ఆ రేంజ్ లో హిట్ అయ్యింది అని కౌంటర్లు ఇస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా గ్రాండ్ గానే తీశారు కానీ ఆ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించలేదు అని అంటున్నారు. ఇక మరో వారసుడు అల్లు శిరీష్ ను పెట్టి భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద అదే తరహాలో సక్సెస్ అవుతుందా అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు.