రామాయణ తరువాత యష్ ఏం చేయబోతున్నాడు?
`కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిన కన్నడ స్టార్ హీరోగా యష్.
By: Tupaki Desk | 3 May 2026 12:00 AM IST`కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిన కన్నడ స్టార్ హీరోగా యష్. కేజీఎఫ్ 2 తరువాత నెక్ట్స్ మూవీ కోసం సుదీర్ఘ విరామం తీసుకున్నయష్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో చేసిన పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా `టాక్సిక్`. యష్ వయసు మళ్లీన వ్యక్తిగా, యువకుడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మీణీ వసంత్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాల్ని పెంచేసింది. కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందించిన ఈ సినిమాని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దాదాపు రెండు నెలలుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ముందు మార్చి 19న మేకర్స్ రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై వార్ ప్రకటించడం, సుప్రీం లీడర్‌తో పాటు పలువురు కీలక నేతలని హతమార్చడం తెలిసిందే.
దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీని కారణంగా తమ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నామంటూ టీమ్ ప్రకటించింది. జూన్ 4న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తామంటూ అధికారికంగా వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ డేట్‌న కూడా సినిమా రావడం లేదని హీరో యష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపొందిన ఈ మూవీని అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అందులో భాగంగానే మూవీ రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేశారని తెలిసింది. ఈ మూవీతో పాటు యష్ `రామాయణ`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. రావణాసురుడిగా యష్ నటిస్తున్న ఈ చిత్ర రాజాన్ని రెంగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఫస్ట్ పార్ట్‌ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తుండగా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న యష్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారట.
టాక్సిక్, `రామాయణ` చిత్రాల వరుస షూటింగ్‌లతో గత కొంత కాలంగా బిజీ బిజీగా గడిపేస్తున్న హీరో యష్ `రామాయణ` తరువాత బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడట. 2022లో ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యష్ ఆ తరువాత కొంత బ్రేక్ తీసుకుని సైలెంట్‌గా తన పని తను చేసుకుపోయాడు. సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాకపోయినా కంటిన్యూగా తెర వెనుక వర్క్ చేస్తున్నానని, అందుకే `రామాయణ` పూర్తయి రిలీజ్ అయ్యాక కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్.
