యానిమల్, ధురంధర్ ఎఫెక్ట్.. టాక్సిక్ మరీ ఇంతగానా..?
స్మశానంకు సంబంధించిన విజువల్స్‌తో గ్లింప్స్‌ని స్టార్ట్ చేసిన గీతూ మోహన్ దాస్ ..హీరో యష్ ఇంట్రడక్షన్‌ని ఊహించని ఎరోటిక్ సీన్‌తో పక్కా అడల్ట్ కంటెంట్‌తో రివీల్ చేయడం అభిమానులతో పాటు సగటు సినీ లవర్‌ని షాక్‌కు గురి చేసింది.
By: Tupaki Desk | 9 Jan 2026 11:00 AM ISTభారతీయ సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సినిమాలు యానిమల్, ధురంధర్. సందీప్‌రెడ్డి వంగ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన `యానిమల్` మూవీ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. అదే స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసినా హీరో క్యారెక్టర్, త్రిప్తి దిమ్రీ క్యారెక్టర్‌ని మలిచిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. కొన్ని రోజుల పాటు నెట్టింట పెద్ద చర్చే జరిగింది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగపై కూడా జోరుగా ఫెమినిస్ట్‌లు విమర్శలు గుప్పించారు.
ఇక రీసెంట్‌గా విడుదలైన `ధురంధర్` మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తోంది. ఇండియాపై పాక్ ఆగడాలు, ఐఎస్ ఐ, ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్స్ కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారు? దఆనికి ఇండియ్ పొలిటికల్ లీడర్ ఎలా సహకరిస్తున్నారు? వంటి విషయాల్ని ఓపెన్‌గా చెబుతూ ఆదిత్యధర్ చేసిన ఈ మూవీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో `యానిమల్` తరహా అబ్యూస్ట్ సీన్స్ లేవు కానీ బ్రూతల్ మర్డర్స్.. హై యాక్షన్ సన్నివేశాలున్నాయి. మితిమీరిన హింస ఉండటం, పాక్‌కు వ్యతిరేకంగా రూపొందడంతో కొంత మంది సెక్యులర్ వాదులు ఈ మూవీపై విమర్శలు చేయడం, సినిమాని బ్యాన్ చేయాలని కోరడం తెలిసిందే.
అయితే వీటికి మించి యష్ సినిమా ఉండటం ఇప్పుడు అందరిని షాక్‌కు గురి చేస్తోంది. `కేజీఎఫ్` సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ ఇప్పుడు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో `టాక్సిక్` మూవీ చేస్తున్నాడు. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యష్ పుట్టిన రోజు సందర్భంగా ఇంగ్లీష్‌లో విడుదల చేసిన గ్లింప్స్ చర్చనీయాంశంగా మారింది. మార్చి 19న పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానున్న ఈ సినిమా గ్లింప్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
స్మశానంకు సంబంధించిన విజువల్స్‌తో గ్లింప్స్‌ని స్టార్ట్ చేసిన గీతూ మోహన్ దాస్ ..హీరో యష్ ఇంట్రడక్షన్‌ని ఊహించని ఎరోటిక్ సీన్‌తో పక్కా అడల్ట్ కంటెంట్‌తో రివీల్ చేయడం అభిమానులతో పాటు సగటు సినీ లవర్‌ని షాక్‌కు గురి చేసింది. హాలీవుడ్ సిరీస్‌లలో మాత్రమే కనిపించే పచ్చి అడల్డ్ సన్నివేశాన్ని చూపిస్తూ యష్ క్యారెక్టర్‌ని పరిచయం చేయడం..దానికి ముందు కారుకి ఓ బాంబ్ బ్లాస్టింగ్ మెటీరియల్‌ని కనెక్ట్ చేసి లోపల శృంగార సన్నివేశం జరుగుతుండగా దాన్ని బయట రిఫ్లెక్ట్ చేసే విధంగా కారు, దానికి జత చేసిన బ్లాస్టింగ్ పరికరాన్ని చూపించడం చాలా వల్గర్ ఫీల్‌ని కలిగించింది.
దీనిపై అభిమానులతో పాటు సినీ లవర్స్ మండిపడుతున్నారు. యానిమల్, ధురంధర్ లాంటి సినిమాల్లో సినిమాటిక్ లిబర్టీకి మించి సన్నివేశాలు ఉన్నా కానీ ఎక్కడా మితిమీరిన వల్గారిటీని ప్రజెంట్ చేయలేదని, టాక్సిక్ మాత్రం ఈ సీన్‌తో ఆ పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకులకు పెద్ద టాక్సిక్‌గా మారే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సీన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నామని..గ్లింప్స్‌లోనే ఇంత వల్గారిటీ ఉంటే సినిమాలో ఇంకెంత నింపిందో అని నెట్టింట గీతూ మోహన్‌దాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
