ఆ జోనర్ లో యష్ మరో మూవీ? ఈసారి తెలుగులో?
రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు టాక్సిక్ మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Feb 2026 4:00 PM ISTరాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు టాక్సిక్ మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో విడుదల అవ్వనుంది. మార్చి 19వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే టాక్సిక్ పై భారీ అంచనాలు ఉండగా.. యష్ ఎలాంటి హిట్ అందుకుంటారోనని అంతా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో ఇప్పుడు యష్ మరో భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టాక్సిక్ తోపాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్టు రామాయణలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు యష్. అయితే ఇప్పుడు మరో మైథలాజికల్ కథాంశంతో రూపొందనున్న మూవీపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే.. యష్ కెరీర్ లో అదే తొలి డైరెక్ట్ తెలుగు చిత్రం. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించిన యష్.. ఇప్పుడు డైరెక్ట్ టాలీవుడ్ సినిమాతో సందడి చేయనున్నారన్నమాట. నిజానికి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఆయన.. ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో కేజీఎఫ్ తర్వాత యష్ చేసే సినిమాలపై అందరి ఫోకస్ పడింది. దీంతో స్క్రిప్ట్, రోల్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. నార్మల్ కమర్షియల్ స్టోరీల కంటే పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్టులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వినికిడి. అందులో భాగంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మైథలాజికల్, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్స్ ఉన్న కథలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ రామాయణ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారని, సినిమాలో పవర్ ఫుల్ గా యష్ కనిపించనున్నారని సమాచారం. ఆ మూవీ ఇంకా విడుదల కాకముందే ఆయన యాక్టింగ్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో మైథలాజికల్ కథతో తెలుగు దర్శకుడు ఆయనను సంప్రదించినట్లు టాలీవుడ్ లో టాక్ రావడం విశేషం.
ఆ సినిమాను భారీ విజువల్స్, అదిరిపోయే సెట్స్, మోడ్రన్ టెక్నాలజీతో రూపొందేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వివిధ భాషల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉన్నప్పటికీ, అన్నీ అనుకూలంగా జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో రామాయణ తర్వాత మరో పౌరాణిక కథతో యష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
