Begin typing your search above and press return to search.

యశ్ గొప్ప మనసు.. ఆమె కోసం షూటింగ్‌ ముంబైకి షిఫ్ట్‌

టాక్సిక్‌ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. హీరోయిన్‌ కియారా అద్వానీ పోర్షన్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 11:29 AM IST
యశ్ గొప్ప మనసు.. ఆమె కోసం షూటింగ్‌ ముంబైకి షిఫ్ట్‌
X

కేజీఎఫ్‌ సినిమాతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ రెండు పార్ట్‌లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌ 2 తో యశ్‌ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. వెయ్యి కోట్లకు మించిన వసూళ్లు సాధించిన కేజీఎఫ్ 2 తర్వాత యశ్‌ తదుపరి సినిమా విషయమై చాలా టైం తీసుకున్నాడు. ఫైనల్‌గా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో యశ్‌ సినిమాకు ఓకే చెప్పాడు. భారీ యాక్షన్‌ సినిమాగా పాన్‌ ఇండియాను మించి, ఇంగ్లీష్‌లోనూ విడుదల చేసే విధంగా యశ్‌, గీతూ మోహన్‌ దాస్‌ల కాంబో మూవీ 'టాక్సిక్‌' రూపొందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

టాక్సిక్‌ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. హీరోయిన్‌ కియారా అద్వానీ పోర్షన్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయింది. కియారా గర్భవతి అనే విషయం తెలిసిన వెంటనే మేకర్స్ ఆమె పోర్షన్ షూటింగ్‌ మొత్తాన్ని వెంటనే పూర్తి చేశాడట. అందుకు యశ్‌ కూడా అంగీకరించాడు. తన పనులు అన్నీ పక్కన పెట్టి, కియారా అద్వానీతో ఉండే కాంబో సీన్స్‌ ను షూట్‌ చేయడం జరిగిందట. అందుకోసం యశ్‌ చాలా పెద్ద మనసు చాటుకున్నాడు అంటూ కన్నడ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కియారా అద్వానీ గర్భవతి అనే విషయం కన్ఫర్మ్‌ కాకముందు టాక్సిక్ సీన్స్ ఎక్కువ శాతం బెంగళూరులో ప్లాన్‌ చేశారు, షూటింగ్‌ కోసం సెట్స్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందట. కానీ కియారా అద్వానీ కోసం ముంబైకి మొత్తం షిఫ్ట్‌ చేశారట.

యశ్‌ తాను ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ గర్భవతిగా ఉన్న కియారా ఇబ్బందులు ఎదుర్కోవద్దు, ఆమె ప్రయాణాలు చేయడం మంచిది కాదు అనే ఉద్దేశంతో టాక్సిక్‌ సినిమా షూటింగ్‌ మొత్తంను బెంగళూరు నుంచి ముంబైకి షిప్ట్‌ చేశాడట. కొన్ని నెలల క్రితం ఈ విషయం జరిగింది. షూటింగ్‌ కార్యక్రమాలు అంతా సైలెంట్‌గా జరిగాయి. ఇప్పుడు యశ్‌ చేసిన పని గురించి కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కియారా అద్వానీ కోసం తాను దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు ముంబై షూటింగ్‌లో పాల్గొన్నాడట. అంతే కాకుండా ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్త పడుతూ షూటింగ్‌ చేశారని తెలుస్తోంది. టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ అనుకుని కొన్నాళ్లు షూటింగ్‌ చేసిన తర్వాత ఆమె గర్భవతి అని కన్ఫర్మ్‌ అయింది.

సాధారణంగా అయితే ఆ హీరోయిన్‌ను తొలగించి మరో హీరోయిన్‌ను తీసుకుంటారు. కానీ యశ్‌ కానీ, దర్శకురాలు గీతు మోహన్‌ దాస్ కానీ అలా చేయలేదు. ఈ సినిమాకు యశ్‌ హీరోనే కాకుండా సహ నిర్మాత అనే విషయం తెల్సిందే. ఆయన ఈ సినిమా బడ్జెట్‌ పెరుగుతుంది, ఇతర విషయాలను గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా కియారా అద్వానీతో ముంబై వెళ్లి షూటింగ్‌ చేసుకుని వచ్చాడు. కియారా అద్వానీ ప్రస్తుతం మొత్తం షూటింగ్స్‌కు దూరంగా ఉంటుంది. కొన్ని నెలల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని ఆమె సన్నిహితులు చెప్పారు. డెలివరీ తర్వాత కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుని ఫుల్‌ స్వింగ్‌తో కియారా అద్వానీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ వార్ 2 సినిమాలో కూడా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.