Begin typing your search above and press return to search.

'రామాయ‌ణ' కోసం సెంటిమెంట్ ఫాలోఅవుతున్న య‌ష్‌

చాలా వ‌ర‌కు పౌరాణిక సినిమాల్లో న‌టించే స‌మ‌యంలో రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా మ‌న న‌టులు నియ‌మ నిబంధ‌న‌లు పాటించేవారు.

By:  Tupaki Desk   |   21 April 2025 12:55 PM IST
Yash Transforms Into Fierce Raavana Role
X

చాలా వ‌ర‌కు పౌరాణిక సినిమాల్లో న‌టించే స‌మ‌యంలో రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా మ‌న న‌టులు నియ‌మ నిబంధ‌న‌లు పాటించేవారు. ఈ విష‌యంలో అన్న‌గారు ఎన్టీఆర్ చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచారు. ఆయ‌న న‌టించిన పౌరాణిక సినిమాల స‌మ‌యంలో పాత్ర‌ని బ‌ట్టి నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించ‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ని కొంత మంది పాటిస్తున్నా కొంత మంది మాత్రం పాటించిన దాఖ‌లాలు మ‌నం ఎక్క‌డా చూడ‌లేదు. అయితే తొలి సారి రావ‌ణుడి పాత్ర కోసం క‌న్న‌డ స్టార్ య‌ష్ ఆనాటి సెంటిమెంట్‌ని పాటిస్తుండ‌టం విశేషం.

`కేజీఎఫ్‌` సిరీస్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న క్రేజీ స్టార్ య‌ష్‌. ఈ సినిమాల‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ వైపు యావ‌త్ భార‌తం ఆశ్చంతో చూసేలా చేసిన య‌ష్ మ‌రోసారి అదే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ``కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` త‌రువాత య‌ష్ ఏ సినిమాతో ప్రేక్ష‌కుల ముందెఉకు రాబోతున్నాడు? మ‌ళ్లీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 3`తోనే ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రిస్తాడా? అనే చ‌ర్చ జ‌రిగింది. అయితే ఫైన‌ల్‌గా లేడీ డైరెక్ట‌ర్‌తో `టాక్సిక్‌` మూవీకి శ్రీ‌కారం చుట్టిన య‌ష్ అదే జోష్‌తో మ‌రో మ‌హ‌త్త‌ర సినిమాకు పూనుకున్నారు.

అదే `రామాయ‌ణ‌`. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సార్లు ఎంతో మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టించిన క‌థ‌ని నేటీ సాంకేతిక‌త‌ను జోడించి హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. `దంగ‌ల్‌` ఫేమ్ నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ మూవీని త‌న స్న‌రేహితుడితో క‌లిసి య‌ష్ నిర్మిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్ల‌వి సీతారాములుగా న‌టిస్తుండ‌గా రావ‌ణ బ్ర‌హ్మ పాత్ర‌లో య‌ష్ న‌టిస్తున్నారు.

బాబిడియోల్ హ‌నుమంతుడిగా క‌నిపించ‌నున్న ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో కీల‌క ఘ‌ట్టాల‌ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం సెట్‌లోకి య‌ష్ అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా తాను పోషించేది రావ‌ణ బ్ర‌హ్ క్యారెక్ట‌రే అయినా య‌ష్ మాత్రం అనాదిగా వ‌స్తున్న సెంటిమెంట్‌ని ఫాలో అవుతుండ‌టం విశేషం. త్వ‌ర‌లో సెట్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న య‌ష్ ఈ మూవీ కోసం ఉజ్జ‌య‌ని మ‌హాకాళేశ్వ‌ర్ టెంపుల్‌లో తాజాగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.