Begin typing your search above and press return to search.

య‌శ్ కి డ‌బ్బులున్నాయి. అన్నం లేని వాడికి వడ్డించాలి త‌ప్ప ఉన్న వాడికి ఎందుకంటోంది!

కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో రాకీ భాయ్ గా దేశం మొత్తానికి త‌న స‌త్తా చాటి స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్నాడు య‌ష్.

By:  Tupaki Desk   |   21 May 2025 6:07 PM IST
య‌శ్ కి డ‌బ్బులున్నాయి. అన్నం లేని వాడికి వడ్డించాలి త‌ప్ప  ఉన్న వాడికి ఎందుకంటోంది!
X

కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో రాకీ భాయ్ గా దేశం మొత్తానికి త‌న స‌త్తా చాటి స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్నాడు య‌ష్. కెజిఎఫ్ త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఎంతో ఆలోచించిన య‌ష్, గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో టాక్సిక్ సినిమాను ఓకే చేసి ఆ సినిమాను ప‌ట్టాలెక్కించాడు. టాక్సిక్ తో పాటూ బాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న రామాయ‌ణం సినిమాలోనూ య‌ష్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే య‌ష్ త‌ల్లి పుష్ప అరుణ్ కుమార్ ఇప్పుడు పా అనే ఓ కొత్త ప్రొడ‌క్ష‌న్ కంపెనీని మొద‌లుపెట్టి అందులో కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఆమె నిర్మాణంలో ఇప్పుడు కొత్త‌ల‌వాడి అనే సినిమా రాబోతుంది. రీసెంట్ గా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పుష్ప అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ క్ర‌మంలో మీ అబ్బాయి య‌ష్ తో సినిమా చేస్తారా అని ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు పుష్ప స‌మాధానమిచ్చారు.

య‌ష్ తో నిర్మాత‌గా సినిమా చేయ‌న‌ని, వాడికే చాలా డ‌బ్బులున్నాయి. ఇక నేను తీయాల్సిన అవ‌స‌రం ఏముంది? క‌డుపు నిండిన వాడికి అన్నం పెడితే ఆ విలువ తెలియ‌దు. అందుకే అన్నం లేని వారికి పెట్టాలి. అలానే తాను కూడా టాలెంట్ ఉండి ఛాన్సులు రాని వారితోనే సినిమాలు చేస్తాన‌ని, య‌ష్ తో సినిమా తీయ‌న‌ని నిర్మొహ‌మాటంగా చెప్పారు.

కెజిఎఫ్‌1, కెజిఎఫ్‌2 లో య‌ష్ చాలా ర‌ఫ్ లుక్ లో క‌నిపించాడ‌ని, త‌న కొడుకును తాను స్క్రీన్ పై స్టైలిష్ గా చూడాల‌నుకుంటున్నాని, అదే విష‌యం త‌న కొడుక్కి చెప్తే అలా ఉంటే ఎవ‌రు చూస్తార‌మ్మా? అన్నీ వ‌దిలేసి కేవ‌లం నీ కోసం సినిమా చేయాలా అంటుంటాడ‌ని, మాస్ గా ఉండొద్ద‌ని తాను త‌న కొడుక్కి ఎప్పుడూ చెప్తుంటాన‌ని కూడా పుష్ప అరుణ్ కుమార్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

అయితే ఈ బ్యాన‌ర్ లో ఇక‌పై వ‌రుస‌గా సినిమాలొస్తాయ‌ని, దాదాపు కొత్త వారితోనే సినిమాలు చేయ‌నున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ఇక కొత్త‌లవాడి సినిమా విష‌యానికొస్తే ఈ సినిమాలో పృథ్వీ అంబార్ హీరోగా న‌టించ‌గా, సిరాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కొడుకు య‌ష్ ప్రోత్సాహంతో సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టిన పుష్ప అరుణ్ కుమార్ ఏకంగా ఆ కొడుకుతోనే సినిమా చేయ‌నని చెప్ప‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ప్ప‌టికీ ఈ బ్యాన‌ర్ ను వెనుక నుండి న‌డిపిస్తున్న‌ది య‌షే అని అంద‌రికీ తెలుసు.