యామీ గౌతమ్ ని అలా లాక్ చేయోచ్చు!
సాధారణంగా నటీనుటులు ఎవరైనా కథ..అందులో తన పాత్ర విని నచ్చితే ఒకే చెబుతారు. అందులో ఎక్క డైనా గందరోళం ఉందంటే తలెత్తిన సందేహాలను అడిగి తెలుసుకుంటారు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:30 PMసాధారణంగా నటీనుటులు ఎవరైనా కథ..అందులో తన పాత్ర విని నచ్చితే ఒకే చెబుతారు. అందులో ఎక్క డైనా గందరోళం ఉందంటే తలెత్తిన సందేహాలను అడిగి తెలుసుకుంటారు. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే? మళ్లీ నేరెట్ చేయమని దర్శకులకు చెబుతుంటారు. దర్శకులు కూడా అదే విధానంలో నేరేట్ చేస్తుంటారు. వీలైనంత వరకూ ఏ డైరెక్టర్ అయినా నేరేట్ చేయడానికే చూస్తుంటారు.
చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే నేరేట్ చేయకుండా రాసిన స్క్రిప్ట్ ను , పాత్రను చేతుల్లో పెట్టి చదువుకుని నిర్ణయం చెప్పమంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇదంతా దర్శకుడిపై ఆధార పడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హీరోయిన్లు ఛాన్స్ తీసుకోవడానికి ఉండదు. కానీ యామీ గౌతమ్ మాత్రం ఛాన్స్ తీసుకునే టైప్ అని తెలుస్తోంది. యామీ గౌతమ్కి స్టోరీ నేరేట్ చేయడం కంటే రాసింది తనకు ఇచ్చేస్తా బాగా అర్దం చేసుకుంటానంటోంది.
తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు, దర్శకులకు కథను చెప్పడం కంటే చదవడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. ఒకవేళ అందులో తన పాత్ర బలంగా ఉంటే మొత్తం స్క్రిప్ట్ చదవకుండానే ఒకే చెప్పేస్తా నంటోంది. ఆ విషయంలో స్క్రిప్ట్ ను పెద్దగా పట్టించుకోనంది. దీంతో కొంత మంది దర్శక, రచయితలకు యామినీని ఒప్పించడానికి ఇది మంచి అవకాశమే అవుతుంది. తన పాత్రవరకూ రాసిచ్చేస్తే నచ్చితే ఒకే చేస్తుంది.
లేదంటే నో చెబుతుంది. దీని వల్ల దర్శక, రచయితలకు బోలెడంత సమయం కలిసొస్తుంది. ప్రత్యేకంగా ఆమె దగ్గరకు వెళ్లి నేరేట్ చేయాల్సిన పనిలేదు. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన పని అంతకన్నా ఉండదు. ఫోన్ కాల్ చేసి విషయం చెబితే సరి.