Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ నుంచి ఇంటికెళ్లిపోదాం అనుకుంటోన్న స‌మ‌యంలో!

పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క‌రికీ విజయం అంత తేలికగా దక్కదు. ఎన్నో నిరాశా నిస్పృహలను ఎదుర్కొని, తమదైన ముద్ర వేయడానికి సుదీర్ఘ కాలం శ్రమించాల్సి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   2 Aug 2026 4:00 PM IST
ఇండ‌స్ట్రీ నుంచి ఇంటికెళ్లిపోదాం అనుకుంటోన్న స‌మ‌యంలో!
X

పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క‌రికీ విజయం అంత తేలికగా దక్కదు. ఎన్నో నిరాశా నిస్పృహలను ఎదుర్కొని, తమదైన ముద్ర వేయడానికి సుదీర్ఘ కాలం శ్రమించాల్సి ఉంటుంది. గ్లామర్ ప్రపంచంలో వెలుగి పోతున్న‌ తారల వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. నటనపై అమితమైన మక్కువతో ముందడుగు వేసే ప్రతి ఒక్కరికీ కెరీర్ ఆరంభంలో అడుగుడగునా పరీక్షలే ఎదురవుతాయి. తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సినీ ప్రయాణం పై చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. కెరీర్ పట్ల తీవ్రమైన నిరాశ అలుముకున్న సమయంలో పరిశ్రమను పూర్తిగా వీడి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

సరైన గుర్తింపు దక్కక సతమతమవుతున్న రోజుల్లో మానసికంగా ఎంతగానో కుంగిపోయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఆమె జీవితంలో మలుపు తిప్పిన చిత్రం `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్`. ఆదిత్య ధర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ దేశభక్తి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయం చిత్ర బృందానికే కాలేదు. యామీ గౌతమ్ కెరీర్‌కు కూడా సరికొత్త ప్రాణం పోసింది. అందులో యామీ పాత్ర‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కింది. న‌టిగా విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్నారు.

ఆ ఒక్క విజ‌యం యామీ గౌత‌మ్ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది. పరిశ్రమను వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన నుండి బయటపడి మరింత ఉత్సాహంతో మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకోవడానికి ఆ చిత్రం పునాది వేసింది.

అంతేనా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ తో ప్రేమ‌లో ప‌డి అత‌డిని పెళ్లాడింది. ఆ తర్వాత వరుసగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం యాని గౌతమ్ కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాలేదు. కంటెంట్ ఆధారిత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తనదైన అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రతిభతో పాటు సహనం, సరైన సమయం ఎంత ముఖ్యమో? యామీ గౌత‌మ్ ఉదంతం మ‌రోసారి నిరూపించింది. ఈ ప్రయాణం నేటితరం యువ నటులకు చక్కటి గుణపాఠంలా నిలుస్తుంది. ప్రారంభంలో ఎదురయ్యే వైఫల్యాలకు భయపడి వెనుక‌డుగు వేయకుండా గట్టిగా నిలబడితే విజయం తథ్యమని యామీ అనుభవం చెబుతోంది.

ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌య‌త్నాలు చేసి విసుగు చెంది తిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్న స‌మ‌యంలోనే అవ‌కాశాలు వ‌స్తుంటాయి. న‌టీన‌టులైనా ..ద‌ర్శ‌కులైనా? అవ‌కాశాలు రావాల‌న్నా? స‌క్సెస్ అవ్వాల‌న్నా ఓర్పు స‌హ‌నం అత్యంత కీల‌కం. ప‌రిశ్ర‌మ‌లో అంత ఓపిక ఉన్న వారే విజ‌యతీరాలు చేరుతుంటారు.