రీరిలీజుల్లో యమదొంగ మరింత స్పెషల్! ఎందుకంటే..
ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి ఈ రీరిలీజ్ ను మేకర్స్ మరింత స్పెషల్ గా చేశారు.
By: Tupaki Desk | 17 May 2025 7:04 PM ISTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా మోహన్ బాబు, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన సినిమా యమదొంగ. సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన యమదొంగ అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాంటి ఈ ఐకానిక్ మూవీని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేయబోతున్నారు.
మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే సెలబ్రేషన్స్ ను కాస్త ముందు నుంచే మొదలుపెట్టాలనే ఆలోచనతో యమదొంగ సినిమాను మే 18వ తేదీనే రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రీరిలీజ్ మిగిలిన సినిమాల కంటే భిన్నమైంది. దీని కోసం చిత్ర యూనిట్ చాలానే కష్టపడింది. సినిమా మొత్తాన్ని 8కెలో స్కాన్ చేసి తర్వాత దాన్ని 4కె కు కుదించి ఆడియన్స్ కు మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా దీన్ని రీరిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పుడు ఆడియన్స్, ఫ్యాన్స్ యమదొంగ సినిమాను మరింత సినిమాటిక్ క్వాలిటీతో ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి ఈ రీరిలీజ్ ను మేకర్స్ మరింత స్పెషల్ గా చేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ యమదొంగ రీరిలీజ్ యుఫోరియాను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు.
మరోవైపు ఈ రీరిలీజ్ ను పురస్కరించుకుని హీరోయిన్లు ప్రియమణి, మమతా మోహన్‌దాస్ షూటింగ్ టైమ్ లోని అనుభవాలను షేర్ చేసుకుంటూ వీడియోలను రిలీజ్ చేయగా అవి కూడా నెట్టింట అందరినీ అలరిస్తూ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉండగా, ఈ మూవీకి కీరవాణి అందించిన సంగీతం నెక్ట్స్ లెవెల్ లో ఉండటంతో పాటూ ఇప్పటికీ ఆ సాంగ్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ రీరిలీజుల ట్రెండ్ లో యమదొంగ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
