వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌కి మన యూవీ సిద్ధం
ముంబైలో జరిగిన WAVES లో అత్యంత ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఒప్పందాలు, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు.
By: Tupaki Desk | 3 May 2025 4:42 PM ISTముంబైలో జరిగిన WAVES లో అత్యంత ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఒప్పందాలు, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన తెలుగు నిర్మాతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో అత్యంత కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇండియన్ సినీ ప్రేక్షకుల సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మరింత అద్భుతంగా మారబోతుంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు లేనటువంటి అతి పెద్ద స్క్రీన్ తో మల్టీ ప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నట్లు యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు అధికారికంగా ప్రనకటన చేశారు.
యూవీ క్రియేషన్స్‌కి చెందిన విక్రమ్ రెడ్డి ఇటీవల జరిగిన WAVES లో భాగంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు. ఆ స మయంలో ఏఏ ఆర్ట్స్ అధినేత ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఏఏ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ స్క్రీన్ మల్టీప్లెక్స్ నిర్మాణంకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో చేయడం జరిగింది. నాగ్‌పూర్ ఈ అతి పెద్ద స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా వారు ప్రకటించారు. ఈ మధ్య కాలంలో సింగిల్ స్క్రీన్స్ తో పోల్చితే మల్టీప్లెక్స్‌లకు మంచి స్పందన లభిస్తుంది. అందుకే మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయడం కోసం నిర్మాణ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.
భారతదేశంను వినోద రంగంలో ముందుకు తీసుకు వెళ్లడం కోసం జరిగిన కార్యక్రమంలో భాగంగా పలు నిర్మాణ సంస్థలు, ఎన్నో వీఎఫ్‌ఎక్స్ సంస్థలు, ఓటీటీ సంస్థలు తమ ఫ్యూచర్ ప్రణాళికలను వెళ్లడించారు. ఆ సమయంలో యూవీ క్రియేషన్స్, ఏఏ ఆర్ట్స్ వారు ఈ నిర్ణయంను తీసుకుని అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్ వారు ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌ల నిర్మాణంలో భాగస్వామ్యూలుగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి ఈ విషయమై ప్రధానంగా వార్తల్లో నిలిచారు.
ఇక సినిమాల నిర్మాణం పరంగా చూసుకుంటూ యూవీ క్రియేషన్స్ నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు పలు సినిమాలను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ రాబోయే రోజుల్లో రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఒక వైపు సినిమాల నిర్మాణంతో పాటు మరో వైపు ఇలా మల్టీప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టడం అనేది వారికి సినిమా ఇండస్ట్రీపై ఉన్న అభిమానం, ఆసక్తిని కనబరుస్తోంది అనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌లోనూ అతి పెద్ద స్క్రీన్‌తో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
