Begin typing your search above and press return to search.

పవన్ కోసం రిక్షా కష్టంతో పార్టీ.. అండగా బేబీ నిర్మాత

ఇక రీసెంట్ గా ఒక పేద మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం తప్పకుండా అందరికీ పార్టీ ఇస్తాను అని తన భర్త రిక్షా నడిపిస్తాడు అని ఆ కష్టపడిన డబ్బులతోనే అందరికీ ఒక పండుగ లాంటి పార్టీ ఇస్తాను అంటూ ఆమె చాలా ఆనందంగా తెలియజేసింది.

By:  Tupaki Desk   |   14 May 2024 5:47 AM GMT
పవన్ కోసం రిక్షా కష్టంతో పార్టీ.. అండగా బేబీ నిర్మాత
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి అని చాలామంది సినీ ప్రముఖులు బలంగా కోరుకుంటు ఉన్నారు. ఫ్యాన్స్ తో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి అభిమానాన్ని చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే నిర్మాత ఎస్కేఎన్ అని కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించిన అనేక రకాల అంశాలపై కూడా ఆయన స్పందిస్తూ ఉండడం విశేషం. ఇక నెగిటివ్ గా కామెంట్ చేసే వారికి కౌంటర్లు ఇవ్వడమే కాకుండా పాజిటివ్ కామెంట్లతో వారికి కూడా ఆయన మద్దతు అందిస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా ఒక పేద మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం తప్పకుండా అందరికీ పార్టీ ఇస్తాను అని తన భర్త రిక్షా నడిపిస్తాడు అని ఆ కష్టపడిన డబ్బులతోనే అందరికీ ఒక పండుగ లాంటి పార్టీ ఇస్తాను అంటూ ఆమె చాలా ఆనందంగా తెలియజేసింది.

అయితే ఆమె ప్రేమ, అభిమానానికి చాలామంది ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. నిర్మాత SKN కూడా అందుకు సంబంధించిన వీడియో పై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మాత్రం తప్పకుండా ఆ మహిళ భర్తకు తన సొంత డబ్బులతో ఒక ఆటో కొనిస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

జనసేన పార్టీ ఈసారి తప్పకుండా ప్రభావం చూపుతుంది అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లో భారీ మెజారిటీతో గెలుపొందుతారు అని ఆయన చెబుతున్నారు. ఇక నిర్మాత ఎస్కేన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్నాడు. ఆయన స్పీచ్ లకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బేబీ సినిమాతో ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక ప్రస్తుతం మరికొన్ని డిఫరెంట్ సినిమాలను లైన్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రాకుండా పవన్ కళ్యాణ్ కోసం మాత్రం ఆయన పిఠాపురంలో ప్రచారాలు కూడా చేశాడు. ఇక ఎస్కేఎన్ ఎక్కడికి వెళ్లినా కూడా జనసేన ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.