Begin typing your search above and press return to search.

నాలుగో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వండ‌ర్ ఉమెన్

భర్త జారోన్ వర్సనోతో గాల్ ఆడబిడ్డకు స్వాగతం పలికారు.

By:  Tupaki Desk   |   8 March 2024 3:55 AM GMT
నాలుగో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వండ‌ర్ ఉమెన్
X

వండ‌ర్ ఉమెన్ గాల్ గాడోట్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్ప‌టికే ముగ్గురు పిల్ల‌ల‌కు మామ్ అయిన ఇజ్రాయేలీ బ్యూటీ హాలీవుడ్ లో యాక్ష‌న్ క్వీన్ గా వెలిగిపోతోంది. సాహ‌సోపేత‌మైన యాక్ష‌న్ విన్యాసాల‌తో క‌ట్టి ప‌డేసే గాల్ గాడోట్ అభిమానులందరికీ మ‌రో శుభ‌వార్త‌! `వండర్ ఉమెన్` తన నాల్గవ బిడ్డను స్వాగతించింది. భర్త జారోన్ వర్సనోతో గాల్ ఆడబిడ్డకు స్వాగతం పలికారు.


ఆసుపత్రిలో తన నవజాత శిశువుతో ఉన్న ఫోటోను గాడోట్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ``నా ముద్దుల అమ్మాయి.. స్వాగతం. గర్భం సులభం కాదు.. మేము దానిని సాధించాము. నీవు మా జీవితాల్లో చాలా వెలుగులు తెచ్చావు.. జీవించావు... నీ పేరు- ఓరి, అంటే హీబ్రూలో `నా కాంతి` అని అర్థం. మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. అమ్మాయీ ఇంటికి స్వాగతం.. నాన్న కూడా చాలా బాగున్నారు`` అని గాల్ గాడోట్ వ్యాఖ్యను జోడించింది.

గాల్ షేర్ చేసిన ఈ స్నాప్‌షాట్‌పై హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్ స్పందించారు. అతడు చేతులు ముడుచుకున్న ఎమోజీని షేర్ చేసాడు. లిల్లీ కాలిన్స్ ఇలా రాశారు.. ``ఆహ్హ్హ్హ్ అభినందనలు!!`` అభినందనలు ప్రియమైన గాల్!!! మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము!!! అంటూ మ‌రో అభిమాని శుభాకాంక్ష‌లు తెలిపారు.

ది హాలీవుడ్ రిపోర్టర్ వివ‌రాల ప్ర‌కారం..గాల్ గాడోట్ 2008లో జారోన్ వర్సనోను వివాహం చేసుకున్నారు. 2011లో అల్మా, 2017లో మాయ , 2021లో డానియెల్లాను ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగో బిడ్డ ఓరి జ‌న్మించింది. అప్ప‌ట్లోనే ``నాకు జన్మనివ్వడం చాలా ఇష్టం.. వీలైతే వారానికి ఒకసారి`` అంటూ మాతృత్వంపై త‌న ప్రేమ‌ను గాల్ గాడోట్ బ‌హిర్గ‌తం చేసింది. ఇది చాలా అద్భుతం.. నేను ఎల్లప్పుడూ ఎపిడ్యూరల్స్ తీసుకుంటాను.. న్యాయంగా ఉంటుంది.. కాబట్టి ఇది బాధాకరమైనది కాదు. జీవితాన్ని సృష్టిస్తున్నట్లు మ‌న‌కు అనిపించిన క్షణం.. ఇది నమ్మశక్యం కాదు`` అని తెలిపింది. తన కుటుంబ జీవితాన్ని సాధ్యమైనంత ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతానని కూడా చెప్పింది. అయితే నాలుగో బిడ్డ‌ ఒరి పుట్టుకకు ముందు గర్భం దాల్చిన ఫోటోల‌ను గాల్ షేర్ చేయ‌లేదు. దీనిపై స‌రైన లీకులు కూడా ఏవీ లేవు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... గాడోట్ చివరిసారిగా స్పై థ్రిల్లర్ చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్`లో న‌టించారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా నటించింది.