Begin typing your search above and press return to search.

ఆడపడుచు కట్నం.. మెగా కోడలు ఏమన్నారంటే..

2021 డిసెంబర్‌ లో లావణ్య పుట్టినరోజు సందర్భంగా తన ఇష్టసఖికి లవ్ ప్రపోజల్ చేశారట వరుణ్.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:58 PM GMT
ఆడపడుచు కట్నం.. మెగా కోడలు ఏమన్నారంటే..
X

మిస్టర్‌, అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించి అలరించిన జోడీ వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి.. ఆ సినిమాల ప్రయాణంలో ప్రేమలో పడి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 2021 డిసెంబర్‌ లో లావణ్య పుట్టినరోజు సందర్భంగా తన ఇష్టసఖికి లవ్ ప్రపోజల్ చేశారట వరుణ్. అప్పటి నుంచి వారు ప్రేమలో విహరించినా ఎక్కడా ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.

కొంత కాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఒక్కసారి కూడా కెమెరా కంటికి చిక్కకపోవడం కూడా గ్రేటే. తమ లవ్ ను అంత సీక్రెట్ గా ఉంచిందీ జంట. అయితే మెగా ఫ్యామిలీలో జరిగిన పలు ఫంక్షన్లు, వేడుకల్లో లావణ్య సందడి చేసింది. కానీ వరుణ్‌ చెల్లెలు నిహారికకు లావణ్య మంచి స్నేహితురాలు కావడంతో గెస్ట్ లానే వచ్చిందనుకున్నారంతా. తమ ప్రేమ గురించి కొన్ని సందర్భాల్లో పరోక్షంగా లావణ్య చెప్పినా ఎవరూ పసికట్టలేకపోయారు. ఎలా అయితే ఏంటి.. మొత్తానికి తమ ప్రేమను నిజం చేసుకుని మెగా ఇంట లావణ్య అడుగుపెట్టేసింది.

ఇది పక్కన పెడితే.. సాధారణంగా వివాహ సమయంలో వరుడి అక్కాచెల్లెళ్లకు ఆడపడుచు కట్నంగా డబ్బులు లేక బంగారాన్ని ఇస్తుంటారు వధువు కుటుంబ సభ్యులు. ఇది తెలుగు రాష్ట్రాల్లో కామనే. తాజాగా ఇదే విషయాన్ని లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'వరుణ్ సిస్టర్ నిహారికతో మీరు చాలా క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి మీ మ్యారేజ్ టైమ్ లో ఆమెకు మీ కుటుంబ సభ్యులు ఆడపడుచు కట్నం ఏంటి ఇచ్చారు?' అని యాంకర్ ప్రశ్నించారు.

అయితే తన మ్యారేజ్ టైంలో తాము ఎలాంటి ఆడపడుచు కట్నం ఇవ్వలేదని లావణ్య తెలిపింది. కానీ నిహారిక తన ఫ్యామిలీ మెంబర్ అని, తాను ఏం చేయమన్నా చేస్తా అని చెప్పింది. మంచి స్టోరీ ఉంటే తన ఆడపడుచు ఇటీవలే స్టార్ట్ చేసిన బ్యానర్ లో సినిమా కూడా చేస్తానని పేర్కొంది. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోకుండా మూవీ చేస్తానని తెలిపింది. దీంతో మెగా కోడలు అంటే ఇలానే ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వివాహం తర్వాత ఆమె నటించిన తొలి ప్రాజెక్ట్ మిస్‌ పర్ఫెక్ట్‌ వెబ్‌ సిరీస్‌.. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

కొన్ని రోజుల క్రితం తన భర్త వరుణ్ తో పాటు ఫ్యామిలీ కోసం కూడా లావణ్య మాట్లాడింది. "వరుణ్‌ మంచి లైఫ్‌ పార్టనర్‌. అనేక అంశాల్లో తను చాలా పర్‌ఫెక్ట్‌. నన్ను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. పెళ్లైనా నేను యాక్టింగ్ కంటిన్యూ చేస్తా. మెగా కోడలు అవ్వడం నాకు చాలా స్పెషల్‌. నటన విషయంలో నా పేరెంట్స్‌ ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ఇప్పుడు వరుణ్‌ ఫ్యామిలీ కూడా పెట్టడం లేదు. కానీ నా లిమిట్స్‌ నాకు ఉంటాయి" అని చెప్పింది.