Begin typing your search above and press return to search.

గాంధీజీ జీవితంలోని సంచ‌ల‌న నిజాల‌తో?

కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన `ది బకింగ్‌హామ్ మర్డర్స్` హ‌న్స‌ల్ తెర‌కెక్కిస్తున్న‌ తదుపరి ప్రాజెక్ట్.

By:  Tupaki Desk   |   19 Jan 2024 6:25 PM GMT
గాంధీజీ జీవితంలోని సంచ‌ల‌న నిజాల‌తో?
X

'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ` సిరీస్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. హ‌న్స‌ల్ మెహ‌తా దీనికి ద‌ర్శ‌కుడు. మెహతా ఇటీవలి సిరీస్‌లలో నెట్‌ఫ్లిక్స్ `స్కూప్`.. సోనిLIV `స్కామ్ 2003` గొప్ప ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన షో `స్కామ్ 1992`కి కొనసాగింపుగా స్కామ్ 2003 తెర‌కెక్కింది. కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన `ది బకింగ్‌హామ్ మర్డర్స్` హ‌న్స‌ల్ తెర‌కెక్కిస్తున్న‌ తదుపరి ప్రాజెక్ట్.

ఇంత‌లోనే అన్సల్ మెహతా తన త‌దుప‌రి సిరీస్ చిత్రీకరణను ప్రారంభించాన‌ని తెలిపాడు. `గాంధీ` పేరుతో ఈ షో మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. జనవరి 19న షూటింగ్ ప్రారంభమైనట్లు షో మేకర్స్ ప్రకటించారు. గాంధీ సిరీస్ ని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ `గాంధీ బిఫోర్ ఇండియా`.. `గాంధీ: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ది వరల్డ్` అనే రెండు పుస్తకాల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ వార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేస్తూ వరుస ఫోటోల‌ను హ‌న్స‌ల్ షేర్ చేసారు. ``చరిత్రను సంగ్రహించడంలో ఉంది! #Gandhi filming now (sic) అనే శీర్షికతో అత‌డు త‌న ఈ ప్రాజెక్ట్ గురించి వెల్ల‌డించారు.

`స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ`.. `భాయ్` తర్వాత దర్శకుడు హ‌న్స‌ల్‌- న‌టుడు ప్ర‌తీక్ మూడవ సారి క‌లిసి ప‌ని చేస్తున్నారు. `గాంధీ` ధారావాహికలో ప్రతీక్ టైటిల్ పాత్ర‌లో (మహాత్మా గాంధీగా) నటిస్తున్నారు. గాంధీజీ జీవితక‌థ‌తో ఈ సిరీస్ ని ప‌లు భారతీయ లొకేష‌న్లు, విదేశీ లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.